Minister Vemula | తెలంగాణ ప్రజలపై సీఎం కేసీఆర్‌కు ఉన్నంత ప్రేమ మరెవరికీ ఉండదు : మంత్రి వేముల
Minister Vemula | తెలంగాణ ప్రజలపై సీఎం కేసీఆర్‌కు ఉన్నంత ప్రేమ మరెవరికీ ఉండదని, తెలంగాణ ప్రజల సమస్యలపై, వారి బాగోగులపై కేసీఆర్‌కు ఉన్నంత అవగాహన మరెవరికీ ఉండదని మంత్రి వేముల స్పష్టం చేశారు. కాంగ్రెస్, బీజేపీ నాయకులకు తెలంగాణ ప్రజలపై ఏ మాత్రం ప్రేమ లేదని, ప్రజలకు ఏమీ కావాలో కనీస అవగాహన కూడా లేదని విమర్శించారు.
నిజామాబాద్ : తెలంగాణ ప్రజలపై సీఎం కేసీఆర్‌కు ఉన్నంత ప్రేమ మరెవరికీ ఉండదని, తెలంగాణ ప్రజల సమస్యలపై, వారి బాగోగులపై కేసీఆర్‌కు ఉన్నంత అవగాహన మరెవరికీ ఉండదని మంత్రి వేముల స్పష్టం చేశారు. కాంగ్రెస్, బీజేపీ నాయకులకు తెలంగాణ ప్రజలపై ఏ మాత్రం ప్రేమ లేదని, ప్రజలకు ఏమి కావాలో కనీస అవగాహన కూడా లేదని విమర్శించారు. బాల్కొండ, ముప్కాల్ మండలాల్లో ఆదివారం పలు అభివృద్ది పనుల ప్రారంభోత్సవం, శంకుస్థాన కార్యక్రమాల్లో మంత్రి వేముల ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
బాల్కొండ మండలం బస్సాపూర్ గ్రామంలో రూ.20 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన గ్రామ పంచాయతీ భవనానికి శంకుస్థాపన, రూ.6లక్షల వ్యయంతో గోసంగి సంఘం నూతన భవన నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం..ముప్కాల్ మండలం నల్లూర్ గ్రామంలో 1.70 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన 33/11 కె.వి సబ్ స్టేషన్ ప్రారంభోత్సవం, నిజాంసాగర్ డిస్ట్రిబ్యూటరీ కెనాల్ 82 పై రూ.14 లక్షల వ్యయంతో మరమ్మతుల పనుల ప్రారంభ కార్యక్రమాల్లో పాల్గొని మాట్లాడారు.
ఎన్నికల ముందు ఓట్ల కోసం ఎన్నో చందమామ కథలు చెప్పి ప్రజలను మభ్య పెట్టేందుకు ప్రయత్నం చేస్తారని వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇక్కడ గెలిస్తే 4వేలు పెన్షన్ ఇస్తామని చెప్తున్న కాంగ్రెస్ పార్టీ మొన్ననే కర్ణాటకలో గెలిచింది కదా.. అక్కడ ఎందుకు 4వేల పెన్షన్ ఇవ్వట్లేదని ప్రశ్నించారు. 200 ఉన్న పెన్షన్ 2వేలు చేసింది కేసీఆర్ అని, కాంగ్రెస్ అబద్ధపు హామీలు నమ్మొద్దని అన్నారు.
వ్యవసాయానికి 3 గంటలు కరెంట్ చాలు అని రైతును మళ్లీ గోస పెట్టే మాటలు చెప్తున్న రేవంత్ ఎక్కడ..? రైతులకు కరెంట్ బాదే ఉండొద్దని వ్యవసాయానికి పుష్కలంగా 24 గంటల నాణ్యమైన ఉచిత కరెంట్ ఇస్తున్న కేసీఆర్ ఎక్కడా అని ప్రజలు ఆలోచన చేయాలని కోరారు. రాష్ట్రంలో ఒక యజ్ఞంలా అభివృద్ధి జరుగుతుందని, కేవలం సీఎం కేసీఆర్ వల్లే తెలంగాణ సుభిక్షం అయ్యిందన్నారు. ప్రజలంతా మంచి చేసిన కేసీఆర్‌కు మద్ధతుగా నిలవాలని పిలుపునిచ్చారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

