Vakiti Srihari | రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి అస్వస్థతకు గురయ్యారు. రెండు రోజులుగా తీవ్ర జ్వరం, ఇన్ఫెక్షన్లతో బాధపడుతుండటంతో ఆయన్ను హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని కేర్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం మంత్రి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. మరో రెండు రోజులు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని పేర్కొన్నారు.