తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టు నిర్మిస్తం
తుమ్మిడిహట్టి వద్ద కొత్త ప్రాజెక్టు కడతామని సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పునరుద్ఘాటించారు. మేడిగడ్డ మినహా ఎల్లంపల్లి నుంచి ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టు కాంపోనెంట్లు అన్నింటినీ ఈ సీజన్లో వినియోగిస్తామని తెలిపారు.
- గ్రావిటీ ద్వారా నీటిని తరలిస్తం
- ఈ సీజన్లో ఎల్లంపల్లి నుంచి కాళేశ్వరాన్ని వినియోగిస్తం
- మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
- బరాజ్‌ల పునరుద్ధరణపై ఎన్డీఎస్ఏ చైర్మన్‌తో ఢిల్లీలో భేటీ
హైదరాబాద్, జూలై20 (నమస్తే తెలంగాణ): తుమ్మిడిహట్టి వద్ద కొత్త ప్రాజెక్టు కడతామని సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పునరుద్ఘాటించారు. మేడిగడ్డ మినహా ఎల్లంపల్లి నుంచి ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టు కాంపోనెంట్లు అన్నింటినీ ఈ సీజన్లో వినియోగిస్తామని తెలిపారు. ఎన్డీఎస్ఏ (నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ) సిఫార్సుల మేరకే మేడిగడ్డను పునరుద్ధరిస్తామని వివరించారు. రాష్ట్ర ఇరిగేషన్‌శాఖ ఉన్నతాధికారులతో కలిసి మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి శనివారం ఢిల్లీ వెళ్లిఎన్డీఎస్ఏ చైర్మన్ అనిల్‌జైన్‌తో భేటీ అయ్యారు. ఎన్డీఎస్ఏ మధ్యంతర నివేదిక మేరకు చేపట్టిన పనులు వివరించారు. సాంకేతిక పరీక్షలన్నీ పూర్తి చేయాలని, అప్పటివరకు బరాజ్‌లలో నీటిని నిల్వ చేయవద్దని ఎన్డీఎస్ఏ అధికారులు వెల్లడించినట్టు తెలిసింది. సోమవారం మరోసారి ఇంజినీర్ల స్థాయిలో సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు.
ఎల్లంపల్లి నుంచి నీటిని ఎత్తిపోస్తాం
ఎన్డీఎస్ఏతో భేటీ తర్వాత స్థానిక మీడియా ప్రతినిధులతో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎన్డీఎస్ఏతో సుదీర్ఘంగా చర్చించామని వెల్లడించారు. ఎల్లంపల్లి నుంచి కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన అన్నింటినీ వినియోగించుకుంటామని వెల్లడించారు. తుమ్మిడిహట్టి వద్ద కొత్త ప్రాజెక్టును పూర్తిచేసి గ్రావిటీ ద్వారా నీటిని తరలిస్తామని చెప్పారు. పెద్దవాగు అంతర్రాష్ట్ర ప్రాజెక్టనీ, దాని ఆయకట్టంతా ఏపీలోనే ఉన్నదని, ఆ ప్రాజెక్టుకు గండి పడితే తమను బాధ్యులని చేయడం సరికాదని చెప్పారు. సమావేశంలో నీటిపారుదలశాఖ కార్యదర్శి రాహుల్‌బొజ్జా, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్‌జీవన్ పాటిల్, ఎక్స్పర్ట్ కమిటీ సభ్యులు ఈఎన్సీలు అనిల్‌కుమార్, నాగేందర్రావు, సుధాకర్‌రెడ్డి తదితరులున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | రజనీకాంత్ కెరీర్లో మరో చారిత్రక మైలురాయి .. ‘జైలర్ 2’ ఓటీటీలోకి వచ్చేది ఎప్పుడంటే?
మార్కెట్లో రూ.9,500.. మిల్లులో రూ.8 వేలే.. ఉత్కర్ కాటన్ మిల్లులో పత్తి కొనుగోళ్లపై బీఆర్ఎస్ నాయకుల ఆగ్రహం
Virat Kohli: స్టన్నింగ్ క్యాచ్ పట్టిన విరాట్ కోహ్లీ.. వీడియో
Bhadradri Kothagudem | ముసురుతో ఉప్పొంగుతున్న వాగులు.. నిలిచిన రాకపోకలు!
Renu Desai | పవన్ కళ్యాణ్ ‘బాలు’ ప్యాంట్ వెనుక ఇంత కథ ఉందా.. రేణు దేశాయ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

