Minister Tummala | బ్యాంకుల్లో పొరపాట్లు.. ఆధార్‌లో తప్పులు.. 3 లక్షల ఖాతాలకు రుణమాఫీ అసాధ్యం: మంత్రి తుమ్మల
రైతు రుణమాఫీ ఖాతాల్లో బ్యాంకులు తప్పులు చేశాయని, ఇప్పటివరకు ఆరు కో-ఆపరేటివ్ బ్యాంకుల్లో రెండువేల వరకు తప్పు డు ఖాతాలను గుర్తించామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.
- తప్పులు సరి చేశాక అర్హులకు రుణమాఫీ
- ఆగస్టులో రుణమాఫీ చేయకపోతే ఉరేయండి
- విధి విధానాలు ఖరారు అయ్యాకే రైతుభరోసా
- సచివాలయంలో మీడియాతో మంత్రి తుమ్మల
- రైతుబంధుకు డబ్బులు మూటకట్టలేదు
Minister Tummala | హైదరాబాద్, జూలై 20 (నమస్తే తెలంగాణ): రైతు రుణమాఫీ ఖాతాల్లో బ్యాంకులు తప్పులు చేశాయని, ఇప్పటివరకు ఆరు కో-ఆపరేటివ్ బ్యాంకుల్లో రెండువేల వరకు తప్పుడు ఖాతాలను గుర్తించామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. దా దాపు 3 లక్షల రుణ ఖాతాలకు సంబంధించిన రైతుల ఆధార్‌కార్డుల్లో పొరపాట్లు ఉన్నాయని, వారికి రుణమాఫీ చేయడం సాధ్యం కాదని చె ప్పారు. వీరంతా ఆధార్‌కార్డుల్లో మార్పులు చే సుకుని, దానిని స్థానిక అధికారులకు సమర్పించి అప్డేట్ చేయించుకోవాలని సూచించా రు. ఆ తర్వాత అర్హులైనవారికి రుణమాఫీ అ వుతుందని స్పష్టంచేశారు. శనివారం ఆయన సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. రుణమాఫీ కోసం నిర్ణయించిన కటాఫ్ తేదీ కంటే ముందు రుణాలు తీసుకున్న ఖాతాలను కూడా కొన్ని బ్యాంకులు జాబితాలో చేర్చిన విషయాన్ని గుర్తించినట్టు తెలిపారు.
ఈ విధం గా ఒకే బ్యాంకులో ఒకేసారి 500 తప్పుడు ఖాతాలను జాబితాలో చేర్చారని వెల్లడించా రు. ఇలాంటి వాటిపై ఆడిట్‌తోపాటు విచారణ కూడా జరుగుతున్నదని తెలిపారు. ఉద్దేశపూర్వకంగా తప్పులు చేసిన బ్యాంకులు లేదా బ్యాంకు అధికారులపై చట్టప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టంచేశారు. రైతు రుణఖాతాలు 44 లక్షలుగా ఉన్న ట్టు గుర్తించామని, వాస్తవంగా ఇప్పటికే 39 లక్షల ఖాతాలున్నాయని పేర్కొన్నారు. ఆధార్‌లో తప్పులు, పేర్లలో తప్పులు, రేషన్‌కార్డు.. ఇలా రకరకాల కారణాలతో తప్పులు ఉన్నవి ఎన్నో గుర్తించాల్సి ఉన్నదని, పూర్తవడానికి మరో నెల సమయం పట్టే అవకాశాలు ఉంటాయని పేర్కొన్నారు. వచ్చే ఆగస్టులోనే 44 లక్ష ల ఖాతాదారులకు మొత్తం రుణమాఫీ చేస్తామని, ఒకవేళ రుణమాఫీ జరుగకపోతే ఉరేయాలని సవాల్ చేశారు.
డబ్బులు మూటకట్టి పెట్టలేదు..
రుణమాఫీలో సమస్యల పరిష్కారానికి స్థానికంగా అగ్రికల్చర్ అధికారిని సంప్రదించాలని మంత్రి తుమ్మల సూచించారు. ఇన్‌కంట్యాక్స్ చెల్లించేవారు రుణమాఫీ పరిధిలోకి రా రని స్పష్టంచేశారు. రైతుభరోసా కోసం డబ్బు లు మూటకట్టి పెట్టలేదని వ్యంగ్యంగా మాట్లాడారు. విధి విధానాల ఖరారు తర్వాత రైతుభరోసా అమలుచేస్తామని చెప్పారు. రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని, ఇంకా నా లుగున్నరేండ్లు అధికారంలో ఉంటామని, ఈ పథకం అమలు చేయకపోతే నిలదీయాలని సవాల్ చేశారు. ప్రభుత్వ ఆదాయం ప్రకారం రుణమాఫీ జరుగుతుందని తేల్చిచెప్పారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మామిడి పండ్లు తిన్న వెంటనే ఇవి తీసుకుంటున్నారా.. అయితే ఆరోగ్యాన్ని రిస్క్‌లో పెడుతున్నట్టే..!
Sonia Gandhi | నాటి ఎమర్జెన్సీ నిర్ణయం పొరపాటే.. ఇంటర్వ్యూలో సోనియాగాంధీ కీలక వ్యాఖ్యలు
Skin Color | చర్మం నలుపు రంగులో ఉంటే అనారోగ్యంగా ఉన్నట్లా.. అపోహల గురించి నిపుణులు ఏం చెబుతున్నారు..?
AP News | బొండపల్లి జడ్పీటీసీ స్థానంలో బొత్స కుమార్తె ఓటమి
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

