Tummala Nageswara rao | అశ్వారావుపేటను హార్టికల్చర్ హబ్‌గా మార్చడమే లక్ష్యం: మంత్రి తుమ్మల
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వారావుపేటను హార్టికల్చర్ హబ్‌గా మార్చడమే తన లక్ష్యమని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఆయిల్‌పామ్ పరిశ్రమలో రూ.30 కోట్లతో బయోవిద్యుత్ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తామని తెలిపారు.
కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వారావుపేటను హార్టికల్చర్ హబ్‌గా మార్చడమే తన లక్ష్యమని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Minister Tummala Nageswara rao) అన్నారు. ఆయిల్‌పామ్ పరిశ్రమలో రూ.30 కోట్లతో బయోవిద్యుత్ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తామని తెలిపారు. దీంతో సంస్థపై కరెంటు భారం తగ్గుతుందని చెప్పారు. అశ్వారావుపేటలోని పామాయిల్ పరిశ్రమను ఆయన సందర్శించారు. అనంతరం మాట్లాడుతూ.. విద్యుత్ ప్లాంటు నిర్మాణాన్ని మే నెలలోపు పూర్తిచేసి అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
పామాయిల్లో అంతర పంటల సాగుతో రైతులకు మేలు జరుగుతుందని చెప్పారు. ఈ ప్రాంతం కొబ్బరి, జాజి, మిరియాలు, వక్క తదితర పంటలకు చాలా అనువుగా ఉందని, ప్రభుత్వం నుంచి రైతులకు అవసరమైన సహకారాన్ని అందిస్తామని వెల్లడించారు. అశ్వారావుపేట వ్యవసాయ కళాశాలలో హార్టికల్చర్ కోర్సులు ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ విషయమై త్వరలోనే వీసీతో చర్చిస్తానని తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
Sensory Overload | సెన్సరీ ఓవర్‌లోడ్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. తగ్గేందుకు ఏం చేయాలి..?
Vijay Deverakonda | ట్యాంక్‌బండ్‌పై విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నేడు సద్దుల బతుకమ్మ వేడుకలకు ‘విరోష్’ జంట!
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
Milan protest | ఇటలీలో భారీ నిరసనలు.. స్టోర్ల లూటీ.. తగలబడ్డ రాజధాని మిలన్.. ఖండించిన జార్జియా మెలోని
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

