పాడి పరిశ్రమను ప్రోత్సహిస్తున్నాం : మంత్రి తలసాని
హైదరాబాద్ : పాడి పరిశ్రమ రంగ అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం పూర్తి స్థాయి సహకారం అందిస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పాడి పరిశ్రమ రంగాన్ని ప్రోత్సహించేలా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. నగరంలోని హైటెక్స్‌లో నిర్వహించిన ఫుడ్ అండ్ డెయిరీ ఎగ్జిబిషన్‌ను మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహముద్ అలీ కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. రాష్ట్ర అవసరాలకు సరిపడ పాల ఉత్పత్తిని పెంచేందుకు చేపట్టాల్సిన చర్యలపై అధ్యయనానికి అధికారులతో కమిటీ నియమించినట్లు పేర్కొన్నారు. వ్యవసాయం తర్వాత అత్యధిక కుటుంబాలకు జీవనాధారంగా పాడి పరిశ్రమ రంగం ఉందన్నారు. ఇలాంటి ఎగ్జిబిషన్లు పాడి పరిశ్రమ అభివృద్ధికి ఎంతో దోహదపడుతాయన్నారు.
జీవాల ఆరోగ్య పరిరక్షణపై పశుసంవర్ధక శాఖ ప్రత్యేక కార్యాచరణతో పని చేస్తుందని స్పష్టం చేశారు. జీవాల వద్దకే వైద్య సేవలు తీసుకెళ్ళే విధంగా సంచార పశువైద్యశాలలు పని చేస్తున్నాయన్నారు. పాడి రైతులకు లీటర్ పాలకు రూ. 4 నగదు ప్రోత్సాహకం అందిస్తున్నాం.. ఇలా ఇవ్వడం దేశంలో ఎక్కడా లేదన్నారు. మూసివేత దశకు చేరుకున్న విజయ డెయిరీ రూ. 650 కోట్ల టర్నోవర్ కు చేరుకుంది. రూ. 1,000 కోట్ల టర్నోవర్ లక్ష్యంగా మరిన్ని కార్యక్రమాలు చేపడుతున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Netanyahu | అమెరికా భావి అధ్యక్షుడు మనకు శత్రువు కావచ్చు.. భారత్ చిన్న దేశమేమీ కాదు : నెతన్యాహు
Asian Para Games: ఏషియన్ పారా గేమ్స్.. షూటర్ మోనాకు గోల్డ్, అవనికి సిల్వర్
Ranabaali | ‘రణబాలి’ రికార్డుల మోత.. బతుకమ్మ వేడుకల్లో సందడి చేసిన విరోష్ జోడీ!
Bathukamma Celebrations | సింగపూర్‌లో ఘనంగా బతుకమ్మ – 2026 వేడుకలు
Jailer 2 | ‘జైలర్ 2’ బాక్సాఫీస్ సునామీ.. మూడు రోజుల్లోనే రూ.317 కోట్లకు పైగా వసూళ్లు!
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

