ఈనెల 5 నుంచి చేప పిల్లల పంపిణీ: మంత్రి తలసాని
Talasani Srinivas yadav | ఈ నెల 5 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉచిత చేప పిల్లలు, రొయ్య పిల్లలను పంపిణీ చేయనున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
హైదరాబాద్: ఈ నెల 5 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉచిత చేప పిల్లలు, రొయ్య పిల్లలను పంపిణీ చేయనున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. వచ్చే సోమవారం కార్యక్రమాన్ని ప్రాంభించనున్న నేపథ్యంలో అన్ని జిల్లాల మత్స్య శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మొత్తం 26,778 నీటి వనరులలో రూ.68 కోట్ల చేప పిల్లలు విడుదల చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొనాలని కోరారు.
దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమం పారదర్శకంగా అమలయ్యేలా పర్యవేక్షణ కోసం ప్రత్యేకంగా రూపొందించిన మత్స్యమిత్ర యాప్ను ప్రారంభించారు. సోమవారం (ఈనెల 5న) జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గ పరిధిలోని ఘన్పూర్ రిజర్వాయర్లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేప పిల్లలను విడుదల చేయనున్నారు. ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమంతో రాష్ట్రంలో మత్స్య సంపద గణనీయంగా పెరిగిందన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kaaka | చిరంజీవి చేతిలో కొడవలి, రక్తంతో తడిసిన ఆయుధం.. ‘కాకా’ నుంచి ఊచకోత పోస్టర్
Gajulapeta Villagers | పట్టించుకోని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి.. బీటీ రోడ్డు రెన్యువల్ కోసం గాజులపేట గ్రామస్తుల పాదయాత్ర
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

