Minister Talasani | అక్టోబర్ 5న మెగా డెయిరీ ప్లాంట్ ప్రారంభం : మంత్రి తలసాని
Minister Talasani | తెలంగాణ విజయ డెయిరీకి చెందిన మెగా డెయిరీ ప్లాంట్‌ను(mega dairy plant) అక్టోబర్ 5 వ తేదీన ప్రారంభించనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(Minister Talasani) తెలిపారు. శుక్రవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలోని తన చాంబర్లో విజయ డెయిరీ బోర్డు సమావేశం జరిగింది.
హైదరాబాద్ : తెలంగాణ విజయ డెయిరీకి చెందిన మెగా డెయిరీ ప్లాంట్‌ను(mega dairy plant) అక్టోబర్ 5 వ తేదీన ప్రారంభించనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(Minister Talasani) తెలిపారు. శుక్రవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలోని తన చాంబర్లో విజయ డెయిరీ బోర్డు సమావేశం జరిగింది. ఈ సమావేశంలో డెయిరీ చైర్మన్ సోమా భరత్ కుమార్ గుప్తా, పశుసంవర్ధక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ ఆధార్ సిన్హా, డెయిరీ అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ..రంగారెడ్డి జిల్లా రావిర్యాల్ లో 250 కోట్ల రూపాయల వ్యయంతో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో 5 నుంచి 8 లక్షల లీటర్ల సామర్ధ్యంతో మెగా డెయిరీని నిర్మించినట్లు వివరించారు. ప్రారంభోత్సవానికి అవసరమైన ఏర్పాట్లను త్వరితగతిన చేపట్టి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మెగా డెయిరీ ప్రారంభంతో విజయ ఉత్పత్తుల ఉత్పత్తి సామర్ధ్యం కూడా గణనీయంగా పెరుగుతుందని పేర్కొన్నారు.
దీనిని దృష్టిలో ఉంచుకొని మార్కెటింగ్ వ్యవస్థ ను మరింత బలోపేతం చేయాలని, మరిన్ని విజయ ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేసే దిశగా ప్రణాళికలను సిద్ధం చేయాలని పశుసంవర్ధక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ ఆధార సిన్హాను మంత్రి ఆదేశించారు. అదేవిధంగా రైతుల నుంచి పాల సేకరణ, రవాణా, ఉత్పత్తుల మార్కెటింగ్ తదితర కార్యకలాపాలు సులువుగా నిర్వహించుకొనేందుకు రాష్ట్రంలో 6 జోన్ లను ఏర్పాటు చేసే అంశంపై అధ్యయనం చేయాలని ఆదేశించారు.
రాష్ట్రంలోని అంగన్ వాడీ కేంద్రాలకు విజయ పాలను సరఫరా చేసే విధంగా ఆ శాఖ కు చెందినా అధికారులతో సంప్రదింపులు జరపాలని సూచించారు. విజయ డెయిరీ నేడు 800 కోట్ల రూపాయలకు పైగా టర్నోవర్ కు చేరుకుందని, ఇది ఎంతో గర్వకారణం అన్నారు. విద్యుత్ వినియోగంపై ఆర్ధిక భారాన్ని తగ్గించుకొనే దిశగా సోలార్ విద్యుత్ వినియోగంపై దృష్టి సారించాలని ఆదేశించారు. విజయ డెయిరీ బ్రాండ్ తో నకిలీ ఉత్పత్తులు మార్కెటింగ్ చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు చేపట్టే విధంగా అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

