Minister Talasani | 14 నుంచి ఉచితంగా గాంధీ చిత్ర ప్రదర్శన : మంత్రి తలసాని
Minister Talasani | ఈ నెల 14 నుంచి 24 వ తేదీ వరకు రాష్ట్రంలోని అన్ని థియేటర్లలో ఉచితంగా గాంధీ చిత్రాన్ని ప్రదర్శించనున్నట్లు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(Minister Talasani) తెలిపారు. బుధవారం డాక్టర్ BR అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలోని తన చాంబర్లో చిత్ర ప్రదర్శనకు సంబంధించిన ఏర్పాట్లపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
హైదరాబాద్ : ఈ నెల 14 నుంచి 24 వ తేదీ వరకు రాష్ట్రంలోని అన్ని థియేటర్లలో ఉచితంగా గాంధీ చిత్రాన్ని ప్రదర్శించనున్నట్లు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(Minister Talasani) తెలిపారు. బుధవారం డాక్టర్ BR అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలోని తన చాంబర్లో చిత్ర ప్రదర్శనకు సంబంధించిన ఏర్పాట్లపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు స్వతంత్ర భారత వజ్రోత్సవాల ముగింపు వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ వేడుకల్లో భాగంగానే విద్యార్థుల్లో జాతీయ స్ఫూర్తిని చాటే విధంగా రాష్ట్రంలోని 582 స్క్రీన్లలో గాంధీ చిత్రాన్ని ఉచితంగా ప్రదర్శించనున్నట్లు చెప్పారు.
విద్యార్థులను థియేటర్ల వద్దకు ఉచితంగా తీసుకొచ్చి, క్షేమంగా వారి గమ్య స్థానాలకు తీసుకెళ్లే విధంగా థియేటర్ల నిర్వహకులు, విద్యాశాఖ, రవాణా శాఖ తదితర శాఖలకు చెందిన అధికారులతో సమన్వయం చేసుకొంటూ ఏర్పాట్లు పర్యవేక్షించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. వజ్రోత్సవాల ప్రారంభ సమయంలో కూడా గాంధీ చిత్రాన్ని ఉచితంగా ప్రదర్శించగా లక్షలాది మంది విద్యార్ధులు వీక్షించారని తెలిపారు.
ఈ సమావేశంలో FDC చైర్మన్ అనిల్ కుమార్ కూర్మాచలం, తెలంగాణ స్టేట్ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు సునీల్ నారంగ్, కార్యదర్శి అనుపమ్ రెడ్డి, తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు దిల్ రాజు, కార్యదర్శి దామోదర్ ప్రసాద్, హోం శాఖ ముఖ్య కార్యదర్శి జితేందర్, FDC MD అశోక్ రెడ్డి, న్యాయశాఖ అదనపు కార్యదర్శి మన్నన్, FDC ED కిశోర్ బాబు, UFO, క్యూబ్, సెరసెర, PVR ప్రతినిధులు శ్రీనివాస్, సాయిరఘురామ్, ప్రదీప్, సందీప్, తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rajeev Kanakala | ఎన్టీఆర్ అప్పుడే స్టార్ అవుతాడని చెప్పా, 25 ఏళ్లు గడిచినా మారలేదు.. రాజీవ్ కనకాల ఆసక్తికర వ్యాఖ్యలు!
Dakshinamukhi Anjaneya Swamy | పార్డి (కె) గ్రామంలో ముగిసిన అఖండ హరినామ తాళ సప్తహ వేడుకలు
Mokshagna | మోక్షజ్ఞ డెబ్యూ మూవీపై క్రేజీ అప్డేట్.. దర్శకత్వ బాధ్యతలు వశిష్ఠకే, జనవరి చివరి నుంచి షూటింగ్..
Firecrackers History | దీపావళికి బాణసంచా ఎలా వచ్చింది? చైనా నుంచి భారత్కు టపాసుల ప్రయాణం ఇదే!
Scene | బాక్సాఫీస్ వద్ద సూర్య ‘సీన్’ సెన్సేషన్.. రెండు రోజుల్లో 11.5 లక్షలకు పైగా టికెట్లు!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

