హైదరాబాద్, ఆగస్టు 1(నమస్తే తెలంగాణ): తల్లిపాలే శిశువుకు తొలి టీకా అని, అది ప్రకృతి ప్రసాదించిన సంపూర్ణ పోషకాహారమని మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క పేర్కొన్నారు. ఈనెల 7వరకు నిర్వహించనున్న తల్లిపాల వారోత్సవాలను విజయవంతం చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని శనివారం ఒక ప్రకటన అధికారులను ఆదేశించారు.
తల్లిపాల వారోత్సవాలపై అంగన్వాడీ టీచర్లు, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు.. ఉపాధ్యాయులు, హెల్పర్లు, ఐసీడీఎస్ సూపర్వైజర్లు, వైద్యారోగ్య సిబ్బంది సమన్వయంతో ముందుసాగాలని మంత్రి దిశానిర్దేశం చేశారు.