కామారెడ్డి జిల్లా సంఘటనపై మంత్రి సత్యవతి రాథోడ్ సీరియస్
మంత్రి సత్యవతి రాథోడ్ సీరియస్ | కామారెడ్డి జిల్లాలోని గాంధారి మండలంలో గల బీర్మల్ గిరిజన తండాకు చెందిన ఓ మైనర్ బాలిక శిశువుకు జన్మనిచ్చి ఆత్మహత్య చేసుకున్న ఘటనపై గిరిజన, స్త్రీ - శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

హైదరాబాద్ : కామారెడ్డి జిల్లాలోని గాంధారి మండలంలో గల బీర్మల్ గిరిజన తండాకు చెందిన ఓ బాలిక శిశువుకు జన్మనిచ్చి ఆత్మహత్య చేసుకున్న ఘటనపై గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై వెంటనే విచారణ జరిపి దోషులను పట్టుకుని చట్టపర చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. బాలిక కుటుంబానికి సంతాపం తెలిపారు.
ప్రభుత్వం ఆ కుటుంబానికి అండగా ఉంటుంది అని ధీమా కల్పించారు. మంత్రి ఆదేశాల మేరకు మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టినట్లు తెలిపారు. ఆనంతరం శిశువును హాస్పిటల్ లో చేర్పించి పర్యవేక్షిస్తున్నామని, శిశువు ఆరోగ్యం నిలకడగా ఉందని అధికారులు తెలిపారు. త్వరలోనే దోషులను పట్టుకుని తగిన శిక్ష పడేలా చేస్తామన్నారు.

మగ శిశువుకు జన్మనిచ్చిన మైనర్.. ఆపై ఆత్మహత్య..
ఓ మైనర్ మగ శిశువుకు జన్మనిచ్చి.. ఆ తర్వాత ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన కామారెడ్డి జిల్లా గాంధారి మండలం బీర్మల్ తండాలో చోటు చేసుకుంది. తండాకు చెందిన ఓ బాలిక గర్భం ధరించింది. కానీ ఈ విషయం ఇంట్లో ఎవరికీ తెలియదు. నెలలు నిండడంతో ఆ బాలిక మంగళవారం రాత్రి పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఏం చేయాలో తెలియక ఆమె.. శిశువును చెట్ల పొదల్లో వదిలేసి.. తండాకు సమీపంలోని బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నది.
పసిపాప ఏడుపు విన్న స్థానికులు పోలీసులు, ఐసీడీఎస్ సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న ఐసీడీఎస్ సిబ్బంది.. శిశువును కామారెడ్డి ఏరియా దవాఖానకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

