జనగామ నూతన కలెక్టరేట్‌ను పరిశీలించిన మంత్రులు
మంత్రి సత్యవతి | జనగామ నూతన కలెక్టరేట్ కార్యాలయాన్ని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి శ సత్యవతి రాథోడ్ శుక్రవారం పరిశీలించారు.

జనగామ : జనగామ నూతన కలెక్టరేట్ కార్యాలయాన్ని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి శ సత్యవతి రాథోడ్ శుక్రవారం పరిశీలించారు. ఈ నెల 20వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్ జనగామ జిల్లాలో పర్యటించి వివిధ అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొననున్నారు. అలాగే జిల్లా నూతన కలెక్టర్ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ కార్యాలయాన్ని, ప్రారంభోత్సవ ఏర్పాట్లను పరిశీలించి మంత్రి మాట్లాడారు. ఒకప్పుడు జనగామ అంటే ఎడారి ప్రాంతం. కనీసం తాగడానికి నీళ్లు దొరికేవి కాదన్నారు. కానీ సీఎం కేసీఆర్ నాయకత్వంలో ఈరోజు రెండు పంటలకు సమృద్ధిగా నీరు లభిస్తుందన్నారు.
సమీకృత కలెక్టర్ కార్యాలయం వల్ల అధికారులు అంతా ఒకేచోట ఉండి ప్రజల సమస్యలు పరిష్కారం చేయడం సులువు అవుతుందన్నారు.

కలెక్టర్ కార్యాలయం ప్రారంభం తర్వాత టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభం చేస్తారు. ఆనంతరం బహిరంగ సభ ఉంటుందని మంత్రి తెలిపారు. సీఎం సభను విజయవంతం చేయడానికి మంత్రులం, స్థానిక నాయకత్వం అంతా కలిసి కట్టుగా విజయవంతం చేయాలన్నారు.
కార్యక్రమంలో ఎంపీలు పసునూరి దయాకర్, మాలోతు కవిత, ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, పోచంపల్లి శ్రీనివాస రెడ్డి, బండ ప్రకాష్, ఎమ్మేల్యేలు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, తాటికొండ రాజయ్య, నన్నపనేని నరేందర్, మాజీ ఎమ్మెల్సీ బోడేకుంటి వెంకటేశ్వర్లు, చైర్మన్లు పాగాల సంపత్ రెడ్డి, వాసుదేవ రెడ్డి, మర్రి యాదవ రెడ్డి, నాగుర్ల వెంకన్న, మార్నేని రవీందర్ రావు, గాంధీ నాయక్, ఎడవెల్లి కృష్ణా రెడ్డి, రాజేశ్వర్ రెడ్డి, సంపత్, సత్యమూర్తి, ఉపేందర్, ఇతర నాయకులు ఉన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

