Minister Sathyavathi Rathod | సీఎం కేసీఆర్ వదిలిన బాణం బడే నాగ జ్యోతి : మంత్రి సత్యవతి రాథోడ్
Minister Sathyavathi Rathod | సీఎం కేసీఆర్ వదిలిన బాణం బడే నాగ జ్యోతి(Minister Sathyavathi Rathod) అని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ములుగు నియోజకవర్గ అభ్యర్థి బడే నాగజ్యోతి(Bade Naga Jyothi) నామినేషన్ కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లా డారు.
ములుగు : సీఎం కేసీఆర్ వదిలిన బాణం బడే నాగ జ్యోతి(Minister Sathyavathi Rathod) అని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ములుగు నియోజకవర్గ అభ్యర్థి బడే నాగజ్యోతి(Bade Naga Jyothi) నామినేషన్ కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లా డారు. సీఎం కేసీఆర్ ములుగును జిల్లాగా ఏర్పాటు చేసి, అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి చూపించారు. మేము ఢిల్లీ నుంచి రాలేదు ఇక్కడి నుంచి వచ్చిన బిడ్డలమే. నోటుకు, ఓటు కేసులో జైలుకు పోయి నీతులు వల్లించడం రేవంత్ రెడ్డికే చెల్లుతుందన్నారు. గిరిజన సంక్షేమమే కేసీఆర్ ధ్యేయం.
తండాలను, గూడాలను గ్రామపంచాయతీలుగా చేసుకున్నాం. 10 శాతం గిరిజన రిజర్వేషన్ పెంచుకున్నాం. పోడు భూములకు పట్టాలు అందించాం. మారుమూల ప్రాంతాల్లో సైతం బీటీ రోడ్లు వేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఏం అభివృద్ధి చేసిందో చర్చకు వచ్చే ధైర్యం ఉందా అని ప్రశ్నించారు.
ములుగు జిల్లా పై గులాబీ జెండా ఎగరేసి కేసీఆర్‌కు కానుకనిద్దామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, రెడ్కో చైర్మన్ వై సతీష్ రెడ్డి, రాష్ట్ర రహదారుల భవనాల అభివృద్ధి సంస్థ చైర్మన్ మెట్టు శ్రీను, మండలాల ఇన్చార్జి సమ్మారావు, గ్రంథాలయ చైర్మన్ పోరిక గోవింద్ నాయక్, శ్రీనివాస్ రెడ్డి, ములుగు ఎంపీపీ శ్రీదేవి, వాణిశ్రీ, తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

