పదో తరగతి, ఇంటర్ పరీక్షలపై మంత్రి సబితా రెడ్డి సమీక్ష
minister sabitha indra reddy | పదో తరగతి, ఇంటర్, టెట్ నిర్వహణపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమీక్ష నిర్వహించారు. జిల్లా కలెక్టర్లు, డీఈవోలు, ఆర్టీసీ, ట్రాన్స్‌కో అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
హైదరాబాద్: పదో తరగతి, ఇంటర్, టెట్ నిర్వహణపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమీక్ష నిర్వహించారు. జిల్లా కలెక్టర్లు, డీఈవోలు, ఆర్టీసీ, ట్రాన్స్‌కో అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పాఠశాల విద్యాశాఖ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి విద్యాశాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియ, స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ దేవసేన, ఇంటర్ బోర్డ్ సెక్రటరీ సయ్యద్ ఉమర్ జలీల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పరీక్షల నిర్వహణ సన్నద్ధదతపై చర్చించారు. ఎండలు ఎక్కువగా ఉండటంతో పరీక్ష కేంద్రాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు సూచనలు చేశారు.
రాష్ట్రంలో ఇంటర్ పరీక్షలు వచ్చే నెల 6 నుంచి 24 వరకు జరుగనున్నాయి. అదేవిధంగా పదో తరగతి పరీక్షలు మే 23 నుంచి 28 వరకు జరుగుతాయి. ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) జూన్ 12న నిర్వహించనున్నారు.
ఇంటర్ పరీక్షల షెడ్యూల్..
ఇంటర్ ఫస్టియర్
మే 6 (శుక్రవారం) – సెకండ్ లాంగ్వేజ్
మే 9 (సోమవారం) – ఇంగ్లీష్
మే 11 (బుధవారం) – మ్యాథ్స్-ఏ, వృక్ష శాస్త్రం, పొలిటికల్ సైన్స్
మే 13 (శుక్రవారం) – మ్యాథ్స్ -బీ, జువాలజీ, హిస్టరీ
మే 16 (సోమవారం) – ఫిజిక్స్, ఎకనామిక్స్
మే 18 (బుధవారం) – కెమిస్ట్రీ, కామర్స్
మే 20 (శుక్రవారం) – పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, బ్రిడ్జి కోర్సు మ్యాథ్స్ పేపర్-1
మే 23(సోమవారం) – మోడ్రన్ లాంగ్వేజెస్, జియోగ్రఫి
ఇంటర్ సెకండియర్
మే 7 (శనివారం) – సెకండ్ లాంగ్వేజ్
మే 10 (మంగళవారం) – ఇంగ్లీష్
మే 12 (గురువారం) – మ్యాథ్స్-ఏ, వృక్ష శాస్త్రం, పొలిటికల్ సైన్స్
మే 14 (శనివారం) – మ్యాథ్స్ -బీ, జువాలజీ, హిస్టరీ
మే 17 (మంగళవారం) – ఫిజిక్స్, ఎకనామిక్స్
మే 19 (గురువారం) – కెమిస్ట్రీ, కామర్స్
మే 21 (శనివారం) – పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, బ్రిడ్జి కోర్సు మ్యాథ్స్ పేపర్-2
మే 24 (మంగళవారం) – మోడ్రన్ లాంగ్వేజెస్, జియోగ్రఫి
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

