Ponguleti Srinivas Reddy | సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని పరామర్శించిన మంత్రి పొంగులేటి
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంను మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy) పరామర్శించారు.
హైదరాబాద్: సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంను మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy) పరామర్శించారు. తీవ్ర అనారోగ్యంతో హైదరాబాద్లోని ఏఐజీ దవాఖానలో ఆయన చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం డీసీసీబీ మాజీ చైర్మన్ మువ్వా విజయబాబుతో కలిసి దవాఖానకు వెళ్లిన మంత్రి పొంగులేటి.. ఆయన చికిత్సకు సంబంధించిన వివరాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
కాగా, తమ్మినేని వీరభద్రం ఆరోగ్యం నిలకడగా ఉన్నదని, ప్రాథమికంగా అందిస్తున్న చికిత్సకు ఆయన స్పందిస్తున్నారని ఏఐజీ వైద్యులు వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ నెల 16న అనారోగ్యంతో ఆయన ఏఐజీలో చేరిన విషయం తెలిసిందే. ప్రత్యేక వైద్యబృందం పర్యవేక్షణలో ఆయనకు చికిత్స అందిస్తున్నామని, మరో 24 నుంచి 48 గంటలు అత్యంత కీలకమని, అప్పటివరకు వైద్య బృందం నిరంతరం పర్యవేక్షించడంతో పాటు వెంటిలేషన్తో కూడిన చికిత్స అందించడం జరుగుతుందని వెల్లడించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

