Minister Ponguleti | సోషల్ మీడియా వింగ్‌ను విస్తృత స్థాయిలో ఉపయోగించుకోవాలి : మంత్రి పొంగులేటి
Minister Ponguleti | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేయడంలో సమాచార శాఖ కీలక పాత్ర వహించాలని రాష్ట్ర సమాచార, రెవెన్యూ, గృహనిర్మాణ శాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Minister Ponguleti Srinivas Reddy) అన్నారు. గురువారం డా.బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో సమాచార శాఖ పనితీరును సంబంధిత అధికారులతో సమీక్షించారు(Reviewed).
హైదరాబాద్, డిసెంబర్ 14 : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేయడంలో సమాచార శాఖ కీలక పాత్ర వహించాలని రాష్ట్ర సమాచార, రెవెన్యూ, గృహనిర్మాణ శాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Minister Ponguleti Srinivas Reddy) అన్నారు. గురువారం డా.బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో సమాచార శాఖ పనితీరును సంబంధిత అధికారులతో సమీక్షించారు(Reviewed).
ప్రభుత్వ పథకాల పట్ల ప్రజలను చైతన్య వంతులను చేయడంలో సాంప్రదాయ ప్రచార మాధ్యమాలతోపాటు సోషల్ మీడియా వింగ్ ను విస్తృత స్థాయిలో ఉపయోగించుకోవాలని అధికారులను ఆదేశించారు. తెలంగాణ మాస పత్రికను మరింత ప్రామాణికమైన పత్రికగా తీర్చిదిద్దడంతోపాటు ఈ పత్రికను రాష్ట్రంలోని అన్ని గ్రామాలు, ప్రజా ప్రతినిధులకు, సామాన్య ప్రజానీకానికి అందుబాటులో తేవాలన్నారు. ఈ సందర్భంగా సమాచార శాఖలో వివిధ విభాగాల పనితీరును మంత్రి సమీక్షించారు.
ప్రింట్ మీడియా, అవుట్ డోర్ విభాగం చేపట్టిన కార్యక్రమాలపై ఆయన సమీక్షించారు. జర్నలిస్టుల సంక్షేమం, క్షేత్ర స్థాయిలో ప్రచార నిర్వహణపై దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు. సమాచార శాఖ పనితీరును మెరుగు పర్చాలని అధికారులను ఆదేశించారు. సమాచార శాఖ తోపాటు మీడియా అకాడమీ చేపట్టిన కార్యక్రమాలపై సమాచార కమీషనర్ అశోక్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మంత్రికి వివరించారు.
ఈ సమీక్షా సమావేశంలో సమాచార పౌర సంబంధాల శాఖ డైరెక్టర్ రాజమౌళి, అడిషనల్ డైరెక్టర్ నాగయ్య, జాయింట్ డైరెక్టర్లు జగన్, శ్రీనివాస్, వెంకటరమణ, డిప్యూటీ డైరెక్టర్లు మధు సూధన్, హాష్మి, రాజా రెడ్డి, సురేష్ , చీఫ్ ఇన్ఫర్మేషన్ ఇంజినీర్ రాధా కిషన్, ప్రాంతీయ సమాచార ఇంజినీర్ జయరామ్ మూర్తి, రాములు, అకౌంట్స్ ఆఫీసర్ పద్మ కుమారి, పలువురు అధికారులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | వర్షిణికి నాగార్జున గట్టి కౌంటర్.. దేబ్జానీకి క్లాస్, నరేష్‌కు షాక్!
Allahabad High Court | యూపీలో సిగ్గుచేటుగా పౌరస్వేచ్ఛ.. రాష్ట్ర హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
Sonia Gandhi | ఎమెర్జెన్సీ విధించడం పొరపాటు నిర్ణయం.. ఆత్మకథలో పేర్కొన్న సోనియా
Agniveer Scheme | మరో రెండేండ్ల సర్వీసు తర్వాత అగ్నివీరులకు పొడిగింపు
Supreme Court | ఓబీసీల పాత నియామకాలు, పదోన్నతులు కొనసాగించొచ్చు : సుప్రీంకోర్టు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

