లాభసాటి వ్యవసాయం వైపు దృష్టి సారించాలి : మంత్రి నిరంజన్ రెడ్డి
Minister Niranjan reddy | రైతులు లాభసాటి వ్యవసాయం వైపు దృష్టి సారించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి సూచించారు. సాంప్రదాయ సాగు నుంచి రైతాంగం బయటకు రావాలని పిలుపునిచ్చారు. పెద్ద మందడి మండలం చిన్నమందడి గ్రామంలో నాలుగు
వనపర్తి : రైతులు లాభసాటి వ్యవసాయం వైపు దృష్టి సారించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి సూచించారు. సాంప్రదాయ సాగు నుంచి రైతాంగం బయటకు రావాలని పిలుపునిచ్చారు. పెద్ద మందడి మండలం చిన్నమందడి గ్రామంలో నాలుగు ఎకరాలలో సీతాఫలం తోటను సాగు చేసిన రైతు శ్రీకాంత్ రెడ్డి సీతాఫలాలను శనివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంత్రికి అందజేశారు. ప్రత్యామ్నాయ పంటను సాగుచేసిన రైతును మంత్రి అభినందించారు.
ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. నూనెగింజలు, పప్పుగింజలు, ఉద్యానపంటలతో రైతులకు అధిక ఆదాయం సమకూరుతుందన్నారు. మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగా పంటల సాగును ఎంపిక చేసుకోవాలని సూచించారు. నగరాలు, పట్టణాల సమీపంలోని రైతులు కూరగాయల సాగును ప్రణాళికాబద్ధంగా ఎంపిక చేసుకోవాలని చెప్పారు. ఉద్యానశాఖ ద్వారా సబ్సిడీపై నాణ్యమైన కూరగాయల నారు అందించడం జరుగుతున్నదని తెలిపారు. రైతులు వ్యవసాయ, ఉద్యాన అధికారుల సలహాలు, సూచనలు స్వీకరించాలి. ప్రతి ఐదు వేల ఎకరాలకు ఒక వ్యవసాయ విస్తరణ అధికారి అందుబాటులో ఉన్నారని మంత్రి తెలిపారు. మంత్రి నిరంజన్ రెడ్డి ప్రోత్సాహంతో ఇప్పటికే 200 మంది రైతులు కూరగాయల సాగు వైపు దృష్టి సారించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vegetables | రోజూ ఈ కూరగాయలను తింటే అనేక వ్యాధులకు చెక్ పెట్టవచ్చు.. వైద్యుల సూచన..
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
Keerthi Puraskaram | కీర్తి పురస్కారాన్ని అందుకున్న పొట్లపల్లి శ్రీనివాసరావు
Health tips | తేనెతో గుండె రోగాలకు చెక్ పెట్టవచ్చట.. ఓ అధ్యయనంలో వెల్లడి..!
Collector Priyanka | చదువుతోనే ఆడబిడ్డకు భవిత : కలెక్టర్ ప్రియాంక పిలుపు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

