కంటోన్మెంట్లో 35 వేల ఓట్ల తొలగింపు అక్రమం
సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలో తొలగించిన 35 వేల ఓట్లను తిరిగి జాబితాలో చేర్చాలని కేంద్రానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారకరామారావు లేఖ రాశారు. ఈ విషయంలో సానుకూల నిర్ణయం తీసుకోవాలని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను కోరారు.
- ఇక్కడి ప్రజల రాజ్యాంగ హకులను హరించడమే
- ఐదేండ్లలో ఇక్కడ ఓటర్ల సంఖ్య పెరగకుండా తగ్గింది
- వీరికి ఎన్నికల్లో ఓటు హక్కు కల్పించాలి: మంత్రి కేటీఆర్
- తొలగించిన పేర్లను తిరిగి చేర్చాలని రాజ్‌నాథ్‌కు లేఖ
హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 15 (నమస్తే తెలంగాణ): సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలో తొలగించిన 35 వేల ఓట్లను తిరిగి జాబితాలో చేర్చాలని కేంద్రానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారకరామారావు లేఖ రాశారు. ఈ విషయంలో సానుకూల నిర్ణయం తీసుకోవాలని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను కోరారు. రక్షణ శాఖ భూమిలో అక్రమంగా నివసిస్తున్నారన్న అర్థం లేని కారణంతో అర్హత ఉన్నవారి పేర్లను ఓటరు జాబితా నుంచి అక్రమంగా తొలగించారని తెలిపారు.
ఈ చర్య బోర్డు పరిధిలో శాశ్వత నివాసాలు ఏర్పాటు చేసుకొన్న కుటుంబాల హక్కులకు భంగం కలిగేలా, అక్రమంగా, రాజ్యాంగ వ్యతిరేకంగా ఉన్నదని ఆరోపించారు. తొలగించిన ఓటర్లకు కానీ, వారి కుటుంబాలకు కానీ ఎలాంటి షోకాజ్ నోటీస్ ఇవ్వలేదని గుర్తుచేశారు. భారత పౌరులుగా తెలంగాణలో శాశ్వతంగా నివాసం ఉంటున్నవారి ఉనికిని ప్రశ్నార్థకం చేసేలా, రాజ్యాంగం కల్పించిన ఓటు హకును దూరం చేయటం అక్రమమని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. ఓ కోర్టు గానీ, కంటోన్మెంట్ బోర్డు సైతం వీరు అక్రమంగా నివసిస్తున్నట్టు అధికారికంగా తేల్చలేదని పేర్కొన్నారు.
బాధ్యత కలిగిన పౌరులుగా కంటోన్మెంట్ బోర్డుకు, విద్యుత్తు శాఖకు, వాటర్ సైప్లె డిపార్టుమెంట్‌కు వీరు పన్నులు, బిల్లులు చెల్లిస్తున్నారని వివరించారు. గతంలో జరిగిన కంటోన్మెంట్ బోర్డు ఎన్నికల్లో, అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లోనూ వీరు ఓటు హక్కును వినియోగించుకొన్నారని తెలిపారు. కానీ, ప్రస్తుత కంటోన్మెంట్ బోర్డు వీరి హకులను హరించేలా, ఏకపక్షంగా ఓటర్ల జాబితా నుంచి తొలగించిందని మండిపడ్డారు. అక్రమ నివాసాన్ని రుజువు చేయకుండానే ఓటర్ల జాబితా నుంచి తొలగించటం అన్యాయమని అన్నారు. 2018లో 1,91,849 ఓటర్లు ఉంటే ప్రస్తుతం ఆ సంఖ్య 1,32,722కు తగ్గడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. ఇలాంటి రాజ్యాంగ వ్యతిరేక చర్యల వల్ల దేశంలో ఎక్కడా లేని విధంగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు పరిధిలో ఐదేండ్లలో ఓటర్ల సంఖ్య తగ్గిందని వెల్లడించారు. కేంద్రం వెంటనే జోక్యం చేసుకొని 35 వేల మంది ఓటర్లను జాబితాలో చేర్చాలని విజ్ఞప్తి చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

