Minister KTR | కారోబార్ ప్రభాకర్ కుటుంబానికి అండగా నిలిచిన మంత్రి కేటీఆర్
Minister KTR | చిన్న వయసులోనే గుండెపోటుతో హఠాన్మరణం చెందిన రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం జిల్లెల్ల కారోబార్ ప్రభాకర్ (35) కుటుంబానికి మంత్రి కేటీఆర్ అండగా నిలిచారు. వారి కుటుంబాన్ని ఆదుకుంటామని హామీనిచ్చారు.
సిరిసిల్ల రూరల్: చిన్న వయసులోనే గుండెపోటుతో హఠాన్మరణం చెందిన రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం జిల్లెల్ల కారోబార్ ప్రభాకర్ (35) కుటుంబానికి మంత్రి కేటీఆర్ అండగా నిలిచారు. వారి కుటుంబాన్ని ఆదుకుంటామని హామీనిచ్చారు. గురువారం జిల్లాలోని వ్యవసాయ కళాశాలలో బాబు జగ్జీవన్ రామ్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి విచ్చేసిన మంత్రి కేటీఆర్ ను ప్రభాకర్ భార్య జ్యోతి, పిల్లలు కలిశారు.
తమను ఆదుకోవాలని మంత్రిని వేడుకున్నారు. ప్రభాకర్ మృతి బాధాకరమని, అనివార్య కారణాలతో పరామర్శకు రాలేకపోయానని జ్యోతికి వివరించారు. ఇదే వ్యవసాయ కళాశాలలో ఉద్యోగం ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. అక్కడే ఉన్న వ్యవసాయ కళాశాల ప్రిన్సిపల్ సెక్రటరీ పీఎస్ శ్రీనివాస్ కు ఉద్యోగ భర్తీ ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
రెండు రోజుల్లోనే ఉద్యోగ నియామకానికి సంబంధించిన ఉత్వర్వులు వస్తాయని, ఇక్కడే పని చేసుకుంటూ కుటుంబాన్ని చూసుకోవాలని మంత్రి సూచించారు. కొడుకుల చదువులకు సహాయం చేస్తానని, ధైర్యంగా ఉండాలని భరోసా ఇచ్చారు. మంత్రి కేటీఆర్ ఉద్యోగంతో పాటు పిల్లల చదువులకు అండగా ఉంటానని తెలుపడంతో జ్యోతి తో పాటు సర్పంచ్ మాట్ల మధు, స్థానిక నేతలు కేటీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు.

Whatsapp Image 2023 07 06 At 15.11.46
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

