సుస్థిర ప్రభుత్వం ఉంటేనే అభివృద్ధి సాధ్యం: మంత్రి కేటీఆర్
Minister KTR | తెలంగాణ వచ్చాక రాష్ట్రంలో అద్భుతంగా ఐటీ అభివృద్ధి చెందుతున్నదని మంత్రి కేటీఆర్ అన్నారు. దేశంలోని ఐటీ ఉద్యోగుల్లో 20 శాతం హైదరాబాద్‌లోనే ఉన్నారని చెప్పారు. ఐటీ రంగంలో
హైదరాబాద్: తెలంగాణ వచ్చాక రాష్ట్రంలో అద్భుతంగా ఐటీ అభివృద్ధి చెందుతున్నదని మంత్రి కేటీఆర్ అన్నారు. దేశంలోని ఐటీ ఉద్యోగుల్లో 20 శాతం హైదరాబాద్‌లోనే ఉన్నారని చెప్పారు. ఐటీ రంగంలో తెలంగాణ ప్రగతి తమకు గర్వకారణమన్నారు. హైదరాబాద్ నెక్లెస్‌రోడ్డులోని థ్రిల్ సిటీలో ఐటీ పరిశ్రమల ప్రతినిధుల ముఖాముఖి సమావేశానికి మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఐటీ రంగంలో ఇన్నోవేషన్ ఎకో సిస్టమ్‌ను అద్భుతంగా అభివృద్ధి చేశామన్నారు. మహిళా పారిశ్రామికవేత్తల కోసం వీ-హబ్ ఏర్పాటు చేశామని వెల్లడించారు. ఏ రాష్ట్రంలోనైనా సుస్థిర ప్రభుత్వం ఉంటేనే అభివృద్ధి జరుగుతుందన్నారు.
పెట్టుబడులకు హైదరాబాద్ అనువైన నగరమని మంత్రి కేటీఆర్ చెప్పారు. ఐటీ రంగంలో లక్షలాది ఉద్యోగాలు కల్పించిందని, ఉద్యోగాల కల్పనలో బెంగళూరును హైదరాబాద్ దాటిందన్నారు. ఐటీలో గత రెండేండ్లలో కొత్తగా 40 వేల ఉద్యోగాలు వచ్చాయని తెలిపారు. నగరంలో ఉత్తరంవైపు ఐటీ రంగాన్ని విస్తరిస్తున్నామన్నారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్ అద్భుతంగా పనిచేస్తున్నదని కితాబిచ్చారు. తొలిరెండు స్పేస్‌టెక్ స్టార్టప్‌లు హైదరాబాద్‌కు చెందినవేనని పేర్కొన్నారు. వ్యాపారవేత్తలు హైదరాబాద్ వైపు ఆకర్షితులవుతున్నారని చెప్పారు. తెలంగాణలో టీఫైబర్ నెట్ ద్వారా ఇంటర్నెట్ అందిస్తామని వెల్లడించారు.
ఐటీ మంత్రిగా కేటీఆర్ ఉండటం గర్వకారణం
ఐటీ శాఖ మంత్రిగా కేటీఆర్ ఉండటం ఐటీ ఇండస్ట్రీకి గర్వకారణమని హైసియా ప్రెసిడెంట్ మనీషా అన్నారు. హైదరాబాద్‌లో ఐటీ పరిశ్రమ శరవేగంగా అభివృద్ధి చేందుతున్నదని వెల్లడించారు. పెట్టుబడులు పెట్టడానికి హైదరాబాద్ చాలా అనుకూలమైన ప్రాంతమని ప్రిన్సిపల్ సెక్రెటరీ జయేశ్ రంజన్ అన్నారు. ఐటీ రంగంలో గత రెండేండ్లలో 40 వేల కొత్త ఉద్యోగాలు వచ్చాయన్నారు. కరోనా సమయంలో ఐటీ ఇండస్ట్రీ అందించిన సహకారం మరువలేనిదని చెప్పారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కార్మికుల బోనస్‌పై సింగరేణి యాజమాన్యం నిర్లక్ష్యం
Koppula Eshwar | కరువు మండలాల రైతులకు ఆర్థిక సహాయం విడుదల చేయాలి : మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
IL-76MD | ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అరుదైన రికార్డు.. 13,629 అడుగుల ఎత్తులో IL-76MD ఫ్లైట్ ల్యాండింగ్
ప్రభుత్వ ధాన్యానికి ఎగనామం.. రూ.12 కోట్ల సీఎంఆర్ బియ్యం గల్లంతు
VC Aldas Janaiah | వీసీ అల్డాస్ జానయ్య ట్రాన్స్ఫర్ చేస్తా అని బెదిరించారు.. వేధింపులపై మహిళా ప్రొఫెసర్.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?

