KTR | ఐటీలో మేటి హైదరాబాద్.. రూ. 2.41 లక్షల కోట్లకు చేరిన ఎగుమతులు : మంత్రి కేటీఆర్
KTR | హైదరాబాద్ : ఐటీ రంగంలో హైదరాబాద్ నగరం దూసుకుపోతోందని, ఈ రంగంలో ఎంతో పురోగతి సాధించామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. టీ హబ్‌లో ఐటీ శాఖ 9వ వార్షిక నివేదికను మంత్రి కేటీఆర్ విడుదల చేశారు.
KTR | హైదరాబాద్ : ఐటీ రంగంలో హైదరాబాద్ నగరం దూసుకుపోతోందని, ఈ రంగంలో ఎంతో పురోగతి సాధించామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. టీ హబ్‌లో ఐటీ శాఖ 9వ వార్షిక నివేదికను మంత్రి కేటీఆర్ విడుదల చేశారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. 2013-14లో హైదరాబాద్‌లో ఐటీ ఉత్పత్తులు రూ. 56 వేలు కోట్లు ఉంటే.. అంచెలంచెలుగా ఎదుగుతూ ఇవాళ రూ. 2.41 లక్షల కోట్ల ఐటీ ఎగుమతులకు చేరుకున్నామని తెలిపారు. రాష్ట్రం ఏర్పడిన సమయంలో ఐటీ సెక్టార్లో 3 లక్షల 20 వేల ఉద్యోగాలు ఉంటే.. ఇప్పుడు ఆ సంఖ్య 9 లక్షల 5 వేల 715కు చేరుకున్నదని వివరించారు. అంటే ఐటీ సెక్టార్లో తొమ్మిదేండ్లలో కొత్తగా 5 లక్షలకు పైచిలుకు ఉద్యోగాలు కల్పించినట్లు వెల్లడించారు. ఐటీ రంగంలో బెంగళూరుతో పోటీ పడేలా హైదరాబాద్‌ను నిలబెట్టామని చెప్పారు. కరోనా వచ్చాక ఐటీ రంగంపై అనేక అపోహాలు వచ్చాయి. ఐటీ రంగంలో కేంద్రం నుంచి సహకారం ఏమీ లేదు. మాట సాయం తప్ప కేంద్రం ఎలాంటి అండదండలు అందించలేదు. యూపీఏ ప్రభుత్వం తెలంగాణకు కేటాయిచిన ఐటీఐఆర్‌ను కూడా ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. అయినప్పటికీ నిలదొక్కుకుని ఐటీ రంగాన్ని అగ్రభాగానా నిలబెట్టామని కేటీఆర్ తెలిపారు.
బెల్లంపల్లిలో వాషింగ్టన్ సంస్థలు పెట్టుబడులు
ఐటీ రంగం దూసుకెళ్లేందుకు మా టీమ్ బాగా పని చేస్తోందని కేటీఆర్ ప్రశంసించారు. వాషింగ్టన్లో అనేక మంది పారిశ్రామికవేత్తలతో సమావేశం అయ్యాను. బెల్లంపల్లిలో పెట్టుబడులు పెట్టేందుకు రెండు వాషింగ్టన్ సంస్థలు ముందుకు వచ్చాయని తెలిపారు. అనేక అమెరికా కంపెనీలు హైదరాబాద్‌లో పెట్టుబడులు పెడుతున్నాయని కేటీఆర్ తెలిపారు. అమెరికాకు చెందిన క్వాల్కామ్ హైదరాబాద్‌లో పెట్టుబడులు పెడుతోంది. గూగుల్ కూడా హైదరాబాద్‌లో అతిపెద్ద కేంద్రం నిర్మిస్తోంది. భారత్ కంపెనీ ఎల్టీఐ మైండ్ ట్రీ కంపెనీ వరంగల్‌లో పెట్టుబడులు పెడుతోంది. గ్రిడ్ డైనమిక్స్ హైదరాబాద్‌లో పెట్టుబడులు పెడుతోంది. సైబర్ నేరాలు అరికట్టేందుకు సైబర్ క్రైమ్ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ తెస్తున్నాం అని కేటీఆర్ వివరించారు.
హైదరాబాద్‌కు జర్మనీ కంపెనీ బాష్
హైదరాబాద్‌లో పెట్టుబడి పెట్టేందుకు జర్మనీ కంపెనీ బాష్ ముందుకొచ్చిందని కేటీఆర్ తెలిపారు. మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ హైదరాబాద్‌కు వస్తోంది. లండన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ గ్రూప్ కేంద్రం ఈ ఏడాది వస్తుంది. మరో రెండేళ్లలో డజోన్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ సెంటర్ వస్తోంది. అమెరికాకు చెందిన వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ హైదరాబాద్‌లో ఐడీసీ నిర్మిస్తోంది. అమెరికాకు చెందిన జాప్‌కామ్ సెంటర్ కూడా హైదరాబాద్‌లో పెట్టుబడులు పెడుతోంది. టెక్నిప్ ఎఫ్ఎంసీ కంపెనీ సెంటర్ కూడా వస్తోందన్నారు కేటీఆర్.
త్వరలోనే ఈ మొబిలిటీ వీక్..
వరంగల్, మహబూబ్‌నగర్, నల్లగొండ, సిద్దిపేట, సిరిసిల్ల వంటి పట్టణాలకు కొత్త సంస్థలు వస్తున్నాయని కేటీఆర్ పేర్కొన్నారు. వరంగల్‌కు టెక్ మహీంద్రా, జెన్‌ప్యాక్ వంటి సంస్థలు వస్తున్నాయి. మహబూబ్‌నగర్‌లోనూ కొన్ని సంస్థలు తమ కార్యాలయాలను ఏర్పాటు చేసుకుంటున్నాయి. నల్లగొండ వంటి టైర్ 2 పట్టణాలకు పరిశ్రమలు వస్తున్నాయి. ఫాక్స్‌కాన్ సంస్థ లక్ష ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చింది. త్వరలోనే ఈ మొబిలిటీ వీక్ నిర్వహించబోతున్నాం. టీ వర్క్స్ సంస్థకు ఇటీవలే కేంద్రం అవార్డు ఇచ్చింది. టీ వర్క్స్ స్ఫూర్తితో మహారాష్ట్ర ఎం వర్క్స్ ఏర్పాటు చేయబోతుంది అని కేటీఆర్ తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

