సిరిసిల్ల నీటి సంరక్షణ విధానాలు దేశానికే దిక్సూచి : మంత్రి కేటీఆర్
రాజన్న సిరిసిల్ల : రాజన్న సిరిసిల్ల జిల్లాలోని నీటి సంరక్షణ విధానాలు భారతదేశానికే దిక్సూచిగా మారాయి. యువ ఐఏఎస్లకు ఈ విధానాలు పాఠాలుగా మారడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నానని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లిలో కేటీఆర్ రైతు వేదికను ప్రారంభించి ప్రసంగించారు.

దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర వ్యాప్తంగా 2,603 రైతు వేదికలను సీఎం కేసీఆర్ నాయకత్వంలో నిర్మించాం అని కేటీఆర్ తెలిపారు. ఈ రైతు వేదికల ద్వారా రైతులను సంఘటితం చేస్తున్నామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికి, రైతులకు మద్దతుగా ముందుకు వెళ్తుందన్నారు. ఈ రైతు వేదికల్లో స్థానిక రైతుబంధు సమితి అధ్యక్షులు, వ్యవసాయ విస్తరణ అధికారులు పరస్పరం సంప్రదించుకుంటూ.. సరైన పంటలపై అధ్యయనం చేస్తారు. వ్యవసాయంలో జరుగుతున్న మార్పులు, ఏ రకమైన పంట వేస్తే లాభసాటి, మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలపై చర్చిస్తారు. ఒక ఆలోచనతో కూడిన అర్థవంతమైన వ్యవసాయం కోసం దేశంలో ఎక్కడా లేని విధంగా 5 వేల ఎకరాలకు ఒక క్లస్టర్ ఏర్పాటు చేసి వ్యవసాయ విస్తరణ అధికారులను నియమించాం. దేశంలో ఎక్కడా లేని కార్యక్రమాలు అమలు చేస్తున్నాం. రైతుబంధు, రైతుబీమా, 24 గంటల నాణ్యమైన విద్యుత్ను రైతులకు ఇస్తున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లాకు గోదావరి జలాలు తరలి రావడంతో ఒకట్రెండు కాదు.. 6 మీటర్లు భూగర్భ జలాలు మీదకు వచ్చాయి అని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కుంభకోణాల కుంభమేళా.. సింగరేణిలో కాంగ్రెస్ స్కాముల గోల : కేటీఆర్ సింహ గర్జన
మూడు గంటల పటాటోపం.. ప్రారంభించిన కొద్దిసేపటికే ‘పాలమూరు’ పంపులు బంద్
బలిపీఠంపై కార్మిక బోర్డు.. స్వతంత్ర ప్రతిపత్తిని రద్దు చేసేలా ప్రభుత్వం ప్లాన్
జై కొట్టిన సింగరేణి
హైదరాబాదుడులో భారత్ బోల్తా.. ఉప్పల్ టీ20లో వెస్టిండీస్దే విజయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

