KTR | పరిశ్రమలకు ఊతమిస్తేనే కొలువులు వస్తాయి.. రాష్ట్రానికి సంపద వస్తుంది : మంత్రి కేటీఆర్
KTR | మహబూబ్‌నగర్ : పరిశ్రమలకు ఊతమిస్తేనే కొలువులు వస్తాయి.. రాష్ట్రానికి సంపద వస్తుంది అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. జిల్లా కేంద్రం సమీపంలోని దివిటిపల్లి వద్ద సుమారు 270 ఎకరాల్లో నిర్మిస్తున్న అమరరాజా (Amara raja) లిథియం అయాన్ బ్యాటరీ కంపెనీకి మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు.
KTR | మహబూబ్‌నగర్ : పరిశ్రమలకు ఊతమిస్తేనే కొలువులు వస్తాయి.. రాష్ట్రానికి సంపద వస్తుంది అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. జిల్లా కేంద్రం సమీపంలోని దివిటిపల్లి వద్ద సుమారు 270 ఎకరాల్లో నిర్మిస్తున్న అమరరాజా (Amara raja) లిథియం అయాన్ బ్యాటరీ కంపెనీకి మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ (Minister Srinivas goud), ఉమ్మడి ఏపీ మాజీ మంత్రి గల్లా అరుణ, గల్లా జయదేవ్‌తో కలిసి భూమిపూజలో పాల్గొన్నారు. అనంతరం పవర్‌పాయింట్ ప్రజెంటేషన్, బ్యాటరీ కంపెనీ ప్రతినిధులతో సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. లిథియం అయాన్ బ్యాటరీ మేకింగ్‌లో భారతదేశంలోనే ఇది అతి పెద్ద పెట్టుబడి అని కేటీఆర్ పేర్కొన్నారు. అమరరాజా గ్రూప్ రూ. 9,500 కోట్ల పెట్టుబడిని తీసుకొచ్చినందుకు అమర రాజా కుటుంబ సభ్యులకు అందరికీ ధన్యవాదాలు తెలిపారు.
దీక్షతో, పట్టుదలతో పని చేస్తేనే పెట్టుబడులు వస్తాయి..
ఒక పరిశ్రమ రావాలంటే దాని వెనుకాల తదేకమైన దీక్షతో, పట్టుదలతో పని చేస్తేనే వస్తాయి. ఇది పోటీ ప్రపంచం. పోటీ ప్రపంచంలో అవినీతి రహిత పారదర్శకమైన పాలనతో ముందుకు వెళ్తున్నాం. ఈ దేశంలో ఎక్కడైనా అమరరాజా గ్రూప్ ప్లాంట్ పెట్టుకోవచ్చు. దివిటిపల్లిలో ప్లాంట్ పెడుతామని ప్రకటించిన తర్వాత 8 రాష్ట్రాల సీఎంలు, మంత్రులు వారికి ఫోన్ చేసి తమ తమ రాష్ట్రాలకు రావాలని ఆహ్వానించారు. కానీ అమరరాజా గ్రూప్ వారు ఇక్కడే ప్లాంట్ ప్రారంభించేందుకు సముఖత వ్యక్తం చేశారు.
పెట్టుబడులను ఆహ్వానించేందుకు రాష్ట్రాల మధ్య పోటీ..
ప్రయివేటు రంగంలో పెట్టుబడులను ఆహ్వానించేందుకు అంతర్జాతీయ వేదికలపై ఆయా రాష్ట్రాలు పోటీ పడుతున్నాయి. తమ వద్ద సరిపడ కరెంటు, నీళ్లు, భూములు ఉన్నాయి. మంచి ప్రోత్సాహకాలు ఇస్తామని ప్రోత్సహించే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. మనకున్న పెద్ద శక్తి యువశక్తి. 27 ఏండ్ల లోపు వయసున్న పిల్లలు 70 కోట్ల మంది పిల్లలు ఉన్నారు. వీరందరికి ప్రభుత్వ ఉద్యోగాలు దొరకవు. కాబట్టి అందరికీ ఉద్యోగాలు కల్పించాలంటే.. ప్రయివేటు రంగంలో పెట్టుబడులను ఆహ్వానించాలి. పరిశ్రమలకు ఊతమిస్తేనే కొలువులు వస్తాయి. రాష్ట్రానికి సంపద వస్తుంది. ఈ సంపదతో పేదల కోసం సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసేందుకు ఉపయోగపడుతందని కేటీఆర్ పేర్కొన్నారు.
అమరరాజా యూనిట్ ఏర్పాటుతో 10 వేల మందికి ఉపాధి..
రాష్ట్రం ఏర్పడే నాటికి హైదరాబాద్ ఐటీ రంగంలో 3లక్షల 23 వేల మంది పని చేసేవారు. ఇప్పుడు దాదాపు 10 లక్షల మంది ప్రత్యక్షంగా పని చేస్తున్నారని కేటీఆర్ వివరించారు. ఒక ఐటీ కంపెనీ ఉంటే దాని చుట్టూ ఎన్నో ఉపాధి అవకాశాలు వస్తాయి. అమరారాజ యూనిట్ రావడం వల్ల ఇక్కడ ప్రత్యక్షంగా, పరోక్షంగా 10 వేల మందికి ఉపాధి అవకాశాలు వస్తాయి. దీని వల్ల చుట్టు పక్కల ప్రాంతాల రూపురేఖలు మారిపోతాయి. పెద్ద ఎత్తున పరిశ్రమలు కూడా వస్తాయని కేటీఆర్ పేర్కొన్నారు.
పదేండ్ల కాలంలో రూ. 9,500 కోట్ల పెట్టుబడి
అమరరాజా గ్రూప్ రాబోయే పదేండ్ల కాలంలో రూ. 9,500 కోట్ల పెట్టుబడి పెట్టబోతుంది. 3 సంవత్సరాల్లో రూ. 3 వేల కోట్లు పెట్టుబడి పెట్టనుంది. మిగతా పెట్టుబడి దశల వారీగా పెట్టనుంది. అమరరరాజా యొక్క 37 ఏండ్ల చరిత్ర పరిశీలిస్తే.. దానికి రెట్టింపు ఈ ఒక్క ప్లాంట్‌లోనే పెట్టుబడి పెడుతున్నారు.
ఈ కంపెనీ వల్ల కాలుష్యం సంభవించదు..
అభివృద్ధి నిరోధకులు, ప్రగతి నిరోధకులు ఈ ప్రాంతం బాగు పడొద్దనే ఉద్దేశంతో పుకార్లు సృష్టించి, జరిగే మంచి పనికి విఘాతం కలిగించేప్రయత్నం చేస్తారని కేటీఆర్ తెలిపారు. బ్యాటరీ పరిశ్రమ అని కాలుష్యం వస్తుందని మాట్లాడుతున్నారు. ఇది లిథియం అయాన్ బ్యాటరీ మేకింగ్ కంపెనీ. భవిష్యత్ అంతా ఎలక్ట్రిక్ వాహనాలదే. రాబోయే 20, 30 ఏండ్లలో పెట్రోల్, డిజీల్ వాహనాలను పక్కన పెట్టి.. ఎలక్ట్రిక్ వాహనాలను వాడుతారు. ఆ ఎలక్ట్రిక్ వాహనాల్లో వాడే బ్యాటరీనే ఇక్కడ తయారవుతుంది. సంప్రదాయ బ్యాటరీ వల్ల కాలుష్యం కొంత కలుగుతుంది. జీరో లిక్విడ్ డిశ్చార్జితో అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ కంపెనీ ఏర్పాటు చేస్తున్నారు. లిథియం అయాన్ బ్యాటరీలతో ఒక్క చుక్క కాలుష్యం కూడా జరగదు. లెడ్ యాసిడ్ బ్యాటరీలు తయారు చేయట్లేదు. ఈ పెట్టుబడితో మహబూబ్‌నగర్ ముఖచిత్రం మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని కేటీఆర్ తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Palamuru Rangareddy Lift Irrigation | కాంగ్రెస్ సర్కార్ అలసత్వం.. పాలమూరు- రంగారెడ్డి మోటార్లు బంద్
Riteish Deshmukh | రామ్ పోతినేని ‘RAPO 23’ టీంలోకి రితేశ్ దేశ్‌ముఖ్
Amazon Jobs | ఆ చట్టం అమల్లోకి వస్తే.. అమెజాన్‌లో మళ్లీ ఉద్యోగాల కోత.. ?
smit machchhar | ఆ విషయం నాకు నిజంగా తెలియదు : కెప్టెన్ స్మిత్ మచ్చర్
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

