KTR | కేసీఆర్‌ను సవాల్ చేయడమంటే పోచమ్మ గుడి ముందు పొట్టేలును కట్టేసినట్టే: రేవంత్‌రెడ్డికి మంత్రి కేటీఆర్ హెచ్చరిక
KTR | ముఖ్యమంత్రి కేసీఆర్ కొడంగల్‌కు రాకపోతే తానే కామారెడ్డిలో కేసీఆర్‌పై పోటీ చేసి ఓడిస్తనని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ చురకలు వేశారు. కేసీఆర్‌ను సవాల్ చేసుడంటే పోచమ్మ గుడి ముందు పొట్టేలును కట్టేసినట్టే అని రేవంత్‌ను హెచ్చరించారు.
కామారెడ్డి: ముఖ్యమంత్రి కేసీఆర్ కొడంగల్‌కు రాకపోతే తానే కామారెడ్డిలో కేసీఆర్‌పై పోటీ చేసి ఓడిస్తనని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ చురకలు వేశారు. కేసీఆర్‌ను సవాల్ చేసుడంటే పోచమ్మ గుడి ముందు పొట్టేలును కట్టేసినట్టే అని రేవంత్‌ను హెచ్చరించారు. కామారెడ్డి నియోజకవర్గంలోని బిక్నూరులో పార్టీ శ్రేణులతో నిర్వహించిన సభలో బుధవారం మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఉద్యమ సమయంలో తెలంగాణ బిడ్డలపై తుపాకీ ఎక్కుపెట్టిన రైఫిల్ రెడ్డి కేసీఆర్‌ను ఓడిస్తడట కామారెడ్డిల. కేసీఆర్ ఆగస్టు 21వ తేదీన కామారెడ్డిలో పోటీ చేస్తనని ప్రకటించినప్పటి నుంచి ప్రతిపక్షాలకు ఫ్యూజ్‌లు ఎగిరిపోయినయ్. అందుకే ఏదోదో మాట్లాడుతున్నరు. కేసీఆర్ ఏదో చెడగొడుతందుకు వస్తున్నడని దుష్ప్రచారం చేస్తున్నరు. వాస్తవానికి సీఎం కేసీఆర్ కామారెడ్డి నియోజకవర్గ అభివృద్ధి కోసమే కేసీఆర్ ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నడు. నవంబర్ 9 తారీఖు నాడు కేసీఆర్ నామినేషన్ వేస్తుండ్రు. ఆ రోజు ఇంటికి ఒక్కరు చొప్పున కేసీఆర్ సభకు తరలిరావాలి’ అని పిలుపునిచ్చారు.
‘కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు వస్తడంటరు. అట్లనే ఇప్పుడు కామారెడ్డికి కేసీఆర్ వస్తున్నరు. కామారెడ్డిలో షబ్బీర్ అలీ ఇప్పటికే గంపన్న చేతిలో ఓడిపోయిండు. ఇప్పుడు కేసీఆర్ పోటీకి వస్తుండంటే ఆయన పోటీకి భయపడుతుండు. బీజేపీ ఆయన కూడా కేసీఆర్ మీద పోటీ అంటే వెనుకముందు అయితున్నడు. ఎన్నికల్లో ఎవని ప్రలోభాలకు లొంగొద్దు. బీజేపోడు ఇచ్చే పిప్పర్ మెంట్లకు, బిస్కెట్లకు ఆశపడొద్దు. కేసీఆర్‌ను గెలిపించుకుని ధమ్ బిర్యానీ తినాలి. కాంగ్రెసోడు, బీజేపోడు ఓటు కోసం ఏమిచ్చినా తీసుకోండ్రి. బీజేపోళ్లు సలాకా ఇచ్చినా తీసుకోండ్రి, సిమెంటు ఇచ్చినా తీసుకోండ్రి. ఎందుకంటే అవన్నీ మనల్ని ముంచి ఎత్తుకెళ్లిన గుజరాత్ దొంగ పైసలు. ఎవరేమిచ్చినా తీసుకుని ఓటు మాత్రం కేసీఆర్‌కే గుద్దుండ్రి. మోసాన్ని మోసంతోటే జయించాలి. ముల్లుముల్లుతోటే తియ్యాలి’ అని మంత్రి కేటీఆర్ సూచించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
TTD Insurance | తిరుమల భక్తులకు బీమా పథకం ప్రారంభం.. ఏడుగురికి పరిహారం అందజేత
RS Praveenkumar | మెటా కేసులో ఒక న్యాయం.. ‘మహా’ కేసులో మరో న్యాయం : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
టీఏజీఎస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నూతన కమిటీ
RS Praveen Kumar | హైదరాబాద్‌లో టెర్రర్ అటాక్స్ ఉన్నాయనే కాన్ఫిడెన్షియల్ మెసేజ్ సోషల్ మీడియాలోకి ఎలా వెళ్లింది?
Sheikh Hasina | చేతులకు సంకెళ్లతో మాత్రమే స్వదేశానికి షేక్ హసీనా : బంగ్లాదేశ్
ట్రెండింగ్ వార్తలు
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్

