Minister KTR | మంత్రి కేటీఆర్‌కు మరో అంతర్జాతీయ ఆహ్వానం..
Minister KTR | రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌కు మరో అంతర్జాతీయ ఆహ్వానం అందింది. అక్టోబర్ 24న బెల్జియం రాజధాని బ్రస్సెల్స్‌లో జరగనున్న ప్రతిష్ఠాత్మక టోనీ బ్లెయిర్ ఇనిస్టిట్యూట్ టెక్ యాక్సిలరేటర్ 2023 ఫోరంలో కీలక భాగస్వామిగా పాల్గొనాలని ఆహ్వానం అందింది.
Minister KTR | హైదరాబాద్ : రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌కు మరో అంతర్జాతీయ ఆహ్వానం అందింది. అక్టోబర్ 24న బెల్జియం రాజధాని బ్రస్సెల్స్‌లో జరగనున్న ప్రతిష్ఠాత్మక టోనీ బ్లెయిర్ ఇనిస్టిట్యూట్ టెక్ యాక్సిలరేటర్ 2023 ఫోరంలో కీలక భాగస్వామిగా పాల్గొనాలని ఆహ్వానం అందింది. టోనీ బ్లెయిర్ ఇనిస్టిట్యూట్ ఫర్ గ్లోబల్ ఛేంజ్ వ్యవస్థాపక అధ్యక్షులు, యునైటెడ్ కింగ్డమ్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ మంత్రి కేటీఆర్‌కు ఆహ్వాన లేఖ పంపించారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, డేటా వినియోగం ద్వారా ప్రభుత్వ భవిష్యత్తు, ప్రజా సేవలను మెరుగుపర్చి వాటిని మరింత సరసమైన ధరకు అందించేందుకుగాను ఒక విజన్‌ను రూపొందించినట్లు బ్లెయిర్ తన ఆహ్వానంలో పేర్కొన్నారు. తమ ఈ విజన్‌కు వాస్తవరూపం ఇవ్వడంలో మీరు ముఖ్యమైన భాగమని తాము నమ్ముతున్నామని.. అందుకే భవిష్యత్తు కోసం లీడర్ల ఫోరమ్ అయిన తమ రెండవ టెక్ యాక్సిలరేటర్‌లో పాల్గొనాలని ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు.
టోనీ బ్లెయిర్ నుంచి వచ్చిన ఆహ్వానంపై మంత్రి కేటీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, పరిశ్రమలు, ఇన్నోవేషన్ తదితర రంగాల్లో తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు, సాధిస్తున్న ప్రగతికి ఈ ఆహ్వానం ఒక గుర్తింపు అని ఆయన పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సింగరేణి మండలంలో 500 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు
మొక్కల వెంకటయ్యకు సత్కారం
Gayatri Devi | ఇంద్రకీలాద్రిపై గాయత్రీదేవి అలంకారంలో దర్శనమిచ్చిన దుర్గాదేవి
Ranabaali | ట్రైలర్‌కి డుమ్మా కొట్టిన రష్మిక .. ప్రీ రిలీజ్ ఈవెంట్లో విజయ్ దేవరకొండతో కలిసి సందడి
Supreme Court: సుప్రీంకోర్టును రాజకీయాల్లోకి లాగొద్దు: సీజేఐ సూర్యకాంత్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

