స్పర్శ్ హాస్పిస్ నూతన భవనాన్ని ప్రారంభించిన మంత్రి కేటీఆర్
మంత్రి కేటీఆర్ | ఖాజాగూడలో నూతనంగా నిర్మించిన స్పర్శ్ హాస్పిస్ భవనాన్ని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఆఖరి ఘడియల్లో ఉన్న రోగులకు ఆత్మీయ నేస్తంగా ‘స్పర్శ్ హాస్పిస్’ ఉచిత వైద్య సేవలు అందిస్తున్నది.

హైదరాబాద్: క్యాన్సర్ రోగుల కోసం ఖాజాగూడలో నూతనంగా నిర్మించిన స్పర్శ్ హాస్పిస్ భవనాన్ని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఆఖరి ఘడియల్లో ఉన్న రోగులకు ఆత్మీయ నేస్తంగా ‘స్పర్శ్ హాస్పిస్’ ఉచిత వైద్య సేవలు అందిస్తున్నది. ఇంతకాలం రోటరీ క్లబ్ బంజారాహిల్స్ సారథ్యంలో అక్కడి రోడ్ నం.12లోని అద్దెభవనంలో సేవలు అందించింది. ప్రస్తుతం దానిని ఖాజాగూడలో కొత్తగా నిర్మించిన భవనానికి మార్చారు. దీనిని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.
ఖాజాగూడ వద్ద ఎకరా విస్తీర్ణంలో స్పర్శ్ హాస్పిస్ భవనాన్ని నిర్మించారు. ఈ స్థలాన్ని 33 ఏండ్లపాటు ప్రభుత్వం లీజుకు ఇచ్చింది. మృత్యు ముంగిట్లో ఉన్న వేలాది మంది క్యాన్సర్ రోగులకు స్పర్శ్ హాస్పిస్‌లో ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నారు. అధునాతన భవనంలో పూర్తి వసతులతో 82 పడకలు ఏర్పాటు చేశారు. చిన్నారులకోసం ప్రత్యేకంగా 10 పడకలు ఏర్పాటు చేశారు. ఈ దవాఖానకు ఆంధ్రప్రదేశ్‌తోపాటు ఒడిశా, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, కర్ణాటక నుంచి పెద్దసంఖ్యలో రోగులు వస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

