Minister KTR | పోచంపల్లిలో నేతన్న విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి కేటీఆర్
యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లిలో (Pochampally) మంత్రి కేటీఆర్ (Minister KTR) పర్యటిస్తున్నారు. పట్టణంలోని ప్రధాన రహదారిపై ఏర్పాటు చేసిన నేతన్న విగ్రహాన్ని ఆవిష్కరించారు. కాలాపునర్వి హ్యాండ్లూమ్ యూనిట్‌ను ప్రారంభించారు.
పోచంపల్లి: యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లిలో (Pochampally) మంత్రి కేటీఆర్ (Minister KTR) పర్యటిస్తున్నారు. పట్టణంలోని ప్రధాన రహదారిపై ఏర్పాటు చేసిన నేతన్న విగ్రహాన్ని ఆవిష్కరించారు. కాలాపునర్వి హ్యాండ్లూమ్ యూనిట్‌ను ప్రారంభించారు. సైనీ భారత్ ఇంటిగ్రేటెడ్ హ్యాండ్లూమ్ యూనిట్‌ను సందర్శించారు. హ్యాండ్లూమ్ పార్కుకు శంకుస్థాపన చేశారు. అంతకుముందు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. రూ.100 కోట్లతో చేపట్టనున్న దోభీఘాట్, సమీకృత వెజ్, నాన్‌వెజ్ మార్కెట్, సీసీ రోడ్ల నిర్మాణంతోపాటు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం బాలాజీ ఫంక్షన్హాల్లో జరుగనున్న చేనేత వారోత్సవ సభలో ప్రసంగిస్తారు.
చేనేతలను కాపాడటంతోపాటు నేతన్నలకు భారీగా ఉపాధి కల్పించాలన్న ఉద్దేశంతో పెద్ద ఎత్తున చేనేత యూనిట్‌ని ఏర్పాటుచేసిన సైని భరత్ బృందాన్ని మంత్రి కేటీఆర్ ప్రత్యేకంగా అభినందించారు. చేనేతల అభివృద్ధికి ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపడుతుందని తెలిపారు. ఓ వైపు ప్రధానమంత్రి నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం అన్నింటిని అమ్మి చేనేతలను ఇబ్బంది పెడుతుంటే.. తెలంగాణ ప్రభుత్వం మాత్రం దివాలా తీసిన పోచంపల్లి చేనేత పార్కును కొనుగోలు చేసిందన్నారు. పోచంపల్లి చేనేత పార్క్‌ని పునరుద్ధరించి ఇక్కడి నేతన్నలకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పించాలన్న ఏకైక లక్ష్యంతో ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నదని వెల్లడించారు. తమిళనాడులోని తిరుపూర్ టెక్స్టైల్ క్లస్టర్ మాదిరి పోచంపల్లి నేతన్నలు కలిసి పోచంపల్లి చేనేతల అభివృద్ధి కోసం సమష్టిగా పనిచేయాలని సూచించారు.


Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున క్లాస్.. రోహిత్, అమన్‌లకు షాక్.. వచ్చే వారం కెప్టెన్సీకి నో!
Dasara Safety Tips | దసరాకు ఊరెళ్తున్నారా జాగ్రత్త..! గ్రేటర్లో దొంగల కలకలం
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

