సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలను సంబురంలా జరుపుకుందాం : శ్రేణులకు కేటీఆర్ పిలుపు
60 ఏళ్ల తెలంగాణ ప్రజల ప్రత్యేక రాష్ట్ర సాకారం చేసి, సాధించిన రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకువెళ్తూ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్న తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించాలని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే. తారక రామారావు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కేసీఆర్ జన్మదిన వేడుకలను ఈసారి మూడు రోజులపాటు ఒక సంబరంగా జరుపుకుందామని కేటీఆర్ కార్యకర్తలకు సూచించారు. ఎవరికి తోచిన మేరకు వారు తమ సేవా దృక్పథాన్ని చాటుకునేలా ఈ సంబరాలు ఉండాలని కేటీఆర్ పేర్కొన్నారు.
ఈ మూడు రోజులపాటు పార్టీ శ్రేణులు నిర్వహించాల్సిన కార్యక్రమాల వివరాలు:
ఈనెల 15వ తేదీ- రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాన కార్యక్రమాలు
(ఇందులో భాగంగా రాష్ట్రంలో ఉన్న ఆసుపత్రులు, వృద్ధాశ్రమాలు, అనాధాశ్రమాల వంటి చోట్ల పండ్ల పంపిణీ, ఆహార పంపిణీ, దుస్తుల పంపిణీ వంటి కార్యక్రమాలు)
– 16 తేదీ – అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో రక్తదాన శిబిరాలు
– 17 తేదీ కెసిఆర్ గారి జన్మదినం రోజున రాష్ట్ర వ్యాప్తంగా సర్వమత ప్రార్థనలు, మొక్కలు నాటడం వంటి కార్యక్రమాలు
ఈ మూడు రోజులపాటు ఇవే కాకుండా తెలంగాణ రాష్ట్ర సమితి ప్రతి కార్యకర్త తనకు తోచిన విధంగా ఇతరులకు సహాయ పడేందుకు గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా తమ తమ స్థాయిలో ఏ సేవా కార్యక్రమాన్ని అయినా చేపట్టవచ్చని కేటీఆర్ కార్యకర్తలకు సూచించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

