Minister Koppula | కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటాం : మంత్రి కొప్పుల
Minister Koppula | బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ధర్మపురి నియోజకవర్గం ఎండపల్లి మండలం చర్లపల్లి గ్రామానికి చెందిన పొన్నం గంగాధర్ గౌడ్ 2023 మే నెలలో రోడ్డు ప్రమాదంలో చనిపోయారు.
జగిత్యాల : బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ధర్మపురి నియోజకవర్గం ఎండపల్లి మండలం చర్లపల్లి గ్రామానికి చెందిన పొన్నం గంగాధర్ గౌడ్ 2023 మే నెలలో రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. కాగా, అతడికి బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం ఉండటంతో రెండు లక్షల ప్రమాద బీమా మంజూరైంది. ఈ మేరకు 2 లక్షల రూపాయల చెక్కును గంగాధర్ భార్య జమునకు మంత్రి అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం కలిగి ఉన్న ప్రతి కార్యకర్తకు ఇన్సూరెన్స్ సదుపాయం కల్పించిందన్నారు. పార్టీ కార్యకర్తలు ప్రమాదవశాత్తు చనిపోతే వారి కుటుంబ సభ్యులకు అండగా నిలిచేందుకు ఈ ప్రమాద బీమా ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ పార్టీలో పనిచేసే ప్రతి కార్యకర్త కుటుంబానికి అండగా ఉండేందుకే ఈ బీమా సదుపాయం కల్పించినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సింహాచలం జగన్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు పడిదం మొగిలి, ఎండీ రియాజ్, జిల్లా లేబర్ బోర్డు కమిటీ మెంబర్ సిగిరి ఆనంద్, యూత్ ప్రధాన కార్యదర్శి గొల్లపల్లి రాజు, ఉప సర్పంచ్ అలగం తిరుపతి, బట్టు రామస్వామి, కాటు రావి, గ్రామ శాఖ అధ్యక్షుడు శ్రవణ్, పడిదం వెంకటేష్ పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS Canada | కాంగ్రెస్ సర్కారు డైవర్షన్ పాలిటిక్స్ను తీవ్రంగా ఖండిస్తున్నాం : బీఆర్ఎస్ కెనడా విభాగం
Army Officer’s Wife Shared Info | చైనాతో సహా విదేశీ ఏజెంట్లకు.. కీలక సమాచారం అందించిన ఆర్మీ అధికారి భార్య
Bathukamma Celebrations | మలేషియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
పత్రికా స్వేచ్ఛ పేరుతో నిరాధార ఆరోపణలు తగవు: బీఆర్ఎస్ స్విట్జర్లాండ్ ప్రతినిధి శ్రీధర్
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

