Konda Surekha | గ్రేహండ్స్ కానిస్టేబుల్ మృతికి సంతాపం తెలిపిన అటవీశాఖ మంత్రి
Konda Surekha | మహదేవ్పూర్ అటవీ ప్రాంతంలో వేటగాళ్లు వన్యప్రాణులను బిగించిన కరెంటు తీగలు తగిలి గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ ప్రవీణ్ కుమార్ మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన మృతిపై అటవీశాఖ మంత్రి కొండా సురేఖ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
Konda Surekha | మహదేవ్పూర్ అటవీ ప్రాంతంలో వేటగాళ్లు వన్యప్రాణులను బిగించిన కరెంటు తీగలు తగిలి గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ ప్రవీణ్ కుమార్ మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన మృతిపై అటవీశాఖ మంత్రి కొండా సురేఖ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కూంబింగ్ ఆపరేషన్ చేస్తుండగా సంఘటన జరగడం దురదృష్టకరమన్నారు. ప్రవీణ్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రవీణ్ కుటుంబాన్ని ప్రభుత్వం అన్నివిధాలా ఆదుకుంటుందని స్పష్టం చేశారు.
ఈ సంఘటనకు సంబంధించి సమగ్ర వివరాలు సమర్పించాలని చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ ఎంసీ పర్గెయిన్ను మంత్రి ఆదేశించారు. జంతువులను వేటాడేందుకు వేటగాళ్లు విద్యుత్ తీగలు అమర్చేందుకు అవకాశం ఉన్న ప్రాంతాల వివరాలను సేకరించి గ్రేహౌండ్స్‌తో పాటు స్థానిక పోలీసు అధికారులకు అందించాలని మంత్రి సూచించారు. తద్వారా ప్రమాదాల బారిన పడకుండా ఉండేందుకు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు. వన్యప్రాణులను వేటాడుతూ చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Golden Chariot | స్వర్ణరథంపై శ్రీదేవి, భూదేవి సమేతంగా ఊరేగిన మలయప్పస్వామి
Bomb Threat | విమానానికి బాంబు బెదిరింపు.. సోఫియాలో అత్యవసర ల్యాండింగ్..!
Manne krishank | కుంభకోణాలు చేయడం వల్లే రూ.50 వేల కోట్లు దోచుకున్నారు : మన్నె క్రిశాంక్
Symbiosis Professor: మాజీ విద్యార్థినికి అనుచిత మెసేజ్‌లు పంపిన సింబయాసిస్ ప్రొఫెసర్
Manne krishank | మీ పాత్ర లేకపోతే సీబీఐ విచారణ చేపట్టండి.. సీఎం రేవంత్‌కు మన్నె క్రిశాంక్ సవాల్
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

