Minister Jupally | ఎక్సైజ్ అకాడమీలో మంత్రి జూపల్లి కృష్ణారావు ఆకస్మిక తనిఖీ
Minister Jupally | బండ్లగూడలోని ఎక్సైజ్ అకాడమీలో(Excise Academy) ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు (Minister Jupally)ఆకస్మిక తనిఖీ చేశారు.
హైదరాబాద్ : బండ్లగూడలోని ఎక్సైజ్ అకాడమీలో(Excise Academy) ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు (Minister Jupally)ఆకస్మిక తనిఖీ చేశారు. అకాడమీ పనితీరును అధికారులు మంత్రికి వివరించారు. అకాడమీ అంతా కలియతిరిగిన మంత్రి ఆయా విభాగాల పనితీరు తెలుసుకున్నారు. అనంతరం ప్రస్తుతం అకాడమీలో శిక్షణ పొందుతున్న 129 మంది మంది మహిళా ట్రైనీ కానిస్టేబుళ్లతో సంభాషించారు. శిక్షణ తరగతుల్లో చెబుతున్న పాఠాలు, ఫిజికల్ ట్రైనింగ్ గురించి చర్చించారు.
అకాడమీలో భోజనం ఎలా ఉందని? నీటి సమస్య ఏమైనా ఉందా అని ప్రశ్నించారు. అకాడమీలో అందుతున్న సేవలు, అక్కడి సౌకర్యాలు, శిక్షణ తరగతులు, ఇతర అంశాల గురించి శిక్షణ పొందుతున్న ఎక్సైజ్ మహిళా కానిస్టేబుల్స్ ను అడిగి తెలుసుకున్నారు. ట్రైనీలను ఉద్దేశించి మంత్రి జూపల్లి మాట్లాడుతూ.. ప్రస్తుతం ఉన్న పోటీని తట్టుకుని.. మీరంతా ఎంతో కష్టపడి, స్వయంకృషితో ఈ ఉద్యోగానికి ఎంపికయ్యారని అభినందించారు. ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు.
సమాజానికి మేలు చేసేలా సేవలు అందించాలని, అంకితభావంతో పని చేయాలని కోరారు. సమాజ శ్రేయస్సుకు మాదకద్రవ్యాల నియంత్రణ ఎంతో ముఖ్యమని, గంజాయి, డ్రగ్స్, అక్రమ మద్యం, సారా అమ్మకాలు, రవాణాపై ప్రత్యేక నిఘా పెట్టి, వాటి బారి నుంచి యువతను కాపాడేందుకు సమర్థవంతంగా విధులు నిర్వర్తించాలని సూచించారు. మంత్రి వెంట ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి సయ్యద్ అలీ ముర్తజా రిజ్వీ, అబ్కారీ శాఖ కమిషనర్ చేవూరు హరికిరణ్ ఉన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

