Minister Jupalli | చెంచు మహిళపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షిస్తాం
Minister Jupalli | నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ (Kollapur) మండలం మొలచింతపల్లిలో చెంచు మహిళపై(Chenchu woman )జరిగిన అమానవీయ దాడిపై ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు(Minister Jupalli) స్పందించారు.
హైదరాబాద్ : నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ (Kollapur) మండలం మొలచింతపల్లిలో చెంచు మహిళపై (Chenchu woman )జరిగిన అమానవీయ దాడిపై ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు(Minister Jupalli) స్పందించారు. బాధిత మహిళలకు అండగా ఉంటామన్నారు. జిల్లా ఎస్పీకి ఫోన్ చేసి కేసు పురోగతిని తెలుసుకున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలన్నారు.
వివరాల్లోకి వెళ్తే.. నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ (Kollapur) మండలం మొలచింతపల్లిలో దారుణం జరిగింది. ఓ చెంచు మహిళపై ఇద్దరు విచణారహితంగా దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలు ఈశ్వరమ్మ, ఆమె భర్త ఈదన్న వ్యవసాయ భూమిని అదే గ్రామానికి చెందిన వెంకటేశ్ కౌలుకు తీసుకున్నాడు. ఆ పొలంలోనే వారిద్దరు కూలీ పని చేయిస్తున్నారు. ఇటీవల భార్యాభర్తలు గొడవపడటంతో ఈశ్వరమ్మ తన తల్లిగారి ఊరు చుక్కాయపల్లికి వెళ్లింది.
విషయం తెలుసుకున్న వెంకటేశ్.. తల్లిగారి ఇంటి నుంచి ఈశ్వరమ్మను మొలచింతపల్లి గ్రామానికి తీసుకొచ్చి తన ఇంట్లో బంధించాడు. తన భార్య శివమ్మ, బాధితురాలి బంధువు లక్ష్మమ్మ భర్త లింగస్వామితో కలిసి వెంకటేశ్ ఆమెపై దాడి చేశాడు. పది రోజుల కిందట ఈ దాడి జరగగా శరీరంపై కాల్చిన గాయా లున్నాయి. అప్పటి నుంచి ఆమెను ఇంట్లోనే ఉంచి గ్రామంలోని ఓ ఆర్ఎంపీతో వైద్యం అందించారు. అయితే విషయం తెలుసుకున్న ఈదన్న.. గ్రామస్థులతో కలిసి ఈదమ్మను పంపించమని కోరగా వెంకటేశ్ బెదిరింపులకు పాల్పడ్డాడు.
కుటుంబ సభ్యులు వెళ్లి బాధితురాలిని ఇంటికి తీసుకొని రాగా దాష్టీకం బయటకు వచ్చింది. విషయం తెలుసుకున్న నేషనల్ ఆదివాసి లిబర్టీ కౌన్సిల్ సంస్థ (ఎన్ఏఎస్సీ) సభ్యులు బుధవారం ఆమె ఇంటికి వెళ్లగా జరిగిన విషయం వారికి చెప్పింది. దీంతో వారు ఏఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఏఎస్పీ ఆదేశాలతో ఎస్ఐ రిషికేశ్, జిల్లా సఖి కేంద్రం నుంచి సరిత, అనిత గ్రామానికి వెళ్లి విచారించారు. బాధితురాలిని చికిత్స నిమిత్తం కొల్లాపూర్ దవాఖానకు తరలించారు. అక్కడినుంచి మెరుగైన చికిత్స కోసం నాగర్‌కర్నూల్ జనరల్ హాస్పిటల్‌కు తరలించినట్లు సఖి సభ్యులు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran vs US | ఇరాన్‌పై మళ్లీ సైనికచర్య తప్పదన్న ట్రంప్.. నిప్పుతో చెలగాటమొద్దన్న ఇరాన్..!
Kerala Governor | కేరళ రాజ్ భవన్లో వెజ్ ఓన్లీ కిచెన్.. గవర్నర్ ఆదేశం.. మండిపడ్డ కాంగ్రెస్, సీపీఎం
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

