World Tiger Day | పులులతోనే జీవవైవిధ్యం : మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
World Tiger Day | జీవ వైవిధ్యానికి ప్రధాన ఆధారంగా నిలుస్తున్న పులులను సంరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ప్రపంచ పులుల దినోత్సవం సందర్భంగా మన పర్యావరణ వ్యవస్థలలో పులులు పోషించే కీలక పాత్రను గుర్తించాల్సిన అవసరం ఉందని తెలిపారు.
హైదారాబాద్, జూలై 28: జీవ వైవిధ్యానికి ప్రధాన ఆధారంగా నిలుస్తున్న పులులను సంరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ప్రపంచ పులుల దినోత్సవం సందర్భంగా మన పర్యావరణ వ్యవస్థలలో పులులు పోషించే కీలక పాత్రను గుర్తించాల్సిన అవసరం ఉందని తెలిపారు. పెద్దపులి అంటే శక్తి, అందానికి ప్రతీక మాత్రమే కాదు, అవి ప్రకృతి సమతుల్యతను కాపాడుకోవడానికి సహాయపడే కీస్టోన్ జాతులు అని మనమందరం గ్రహించాలని కోరారు.
ప్రత్యక్షంగా, పరోక్షంగా ఒక పులి మీద అడవి, పర్యావరణం, ప్రకృతి, జంతుజాలం, గడ్డి భూములు, జీవవైవిధ్యం వంటివి ఆధారపడి ఉన్నందున పులుల మనుగడ అనేది మానవాళి మనుగడకు కూడా ప్రధానమన్న విషయాన్ని ప్రజలు తెలుసుకోవాలని పిలుపునిచ్చారు. పెద్ద పులులను సంరక్షణపై ప్రజలల్లో అవగాహన కల్పించడంతో పాటు వారిని భాగస్వామ్యం చేయాలనే ఉద్దేశ్యంతో ప్రతీ ఏటా జూలై 29న ప్రపంచ పులుల దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నామని పేర్కొన్నారు.
పులుల ఆవాసాల సంరక్షణ, విస్తరణకు ప్రజల మద్దతు అవసరమని, పులుల సంరక్షణ గురించి అవగాహన కల్పించడానికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడుతాయని వెల్లడించారు. పెద్దపులుల సంరక్షణకు తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయన్నారు. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ (ఏటీఆర్), కవ్వాల్ టైగర్ రిజర్వ్ (కేటీఆర్)లను చాలా బాగా నిర్వహించడం వల్ల పులుల సంఖ్య గణనీయంగా పెరుగుతోందన్నారు.
రాష్ట్రంలో చేపడుతున్న అటవీ, వన్యప్రాణుల సంరక్షణ చర్యలతో వీటి సంఖ్య గణనీయంగా పెరుగుతోందని చెప్పారు. మేనేజ్మెంట్ ఎఫెక్టివ్నెస్ ఎవాల్యుయేషన్ (ఎంఈఈ) నివేదికలో టైగర్ రిజర్వుల నిర్వహణలో రాష్ట్రానికి చెందిన అమ్రాబాద్ 78.7 శాతం స్కోర్ తో వెరీ గుడ్ క్యాటగిరిలో, కవ్వాల్ 74.2 శాతం స్కోర్ తో గుడ్ కేటగిరీలో నిలిచిందన్నారు.
తెలంగాణలో మెరుగైన అటవీ విస్తరణ, వేటకు తగినసంఖ్యలో జంతువులు, నీటివనరులు వంటివి ఉండడంతో పొరుగున మహారాష్ట్రలోని తిప్పేశ్వర్, తడోబాల్లో పులులు ఇక్కడకు తరలి వస్తున్నాయన్నారు. గడ్డిభూముల పెంపకంతో శాకాహార జంతువుల సంఖ్య బాగా పెరగడం కూడా దీనికి కలిసొస్తోందని చెప్పారు.
వన్యప్రాణులు – మానవుల మధ్య సంఘర్షణ నివారించేందుకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నాం.
పులులకు భద్రత, వాటి సహజ ఆవాసాల సమీప ప్రాంతాలలో నివసించే ప్రజల శ్రేయస్సుకు ప్రాధాన్యమిచ్చే విధంగా టైగర్ ప్రాజెక్ట్ను పునరావిష్కరించుకునే దిశగా అడుగులు వేస్తున్నామని పేర్కొన్నారు.
అటవీ అవాసాల పునరుద్దరణలో భాగంగా కోర్ ఏరియాలో ఉన్న గ్రామాల తరలింపు ప్రక్రియను వేగవంతం చేశామని ఈ సందర్భంగా తెలిపారు. కవ్వాల్ కోర్ ఏరియాలో ఉన్న రాంపూర్, మైసంపేట గ్రామాలకు చెందిన 142 కుటుంబాలకు పునారావాస ప్యాకేజీ కల్పించి రిలోకేట్ చేశామన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

