జయశంకర్ సార్ సేవలు చిరస్మరణీయం : మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
నిర్మల్ : తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ 88వ జయంతి సందర్భంగా నిర్మల్ పట్టణంలో జయశంకర్ విగ్రహానికి దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించుకుంటూ, తెలంగాణ భావజాల వ్యాప్తికి జయశంకర్ తన జీవితాన్ని ధారపోశారని కొనియాడారు. జయశంకర్ సార్ తెలంగాణ సమాజానికి ఎన్నటికీ స్ఫూర్తి ప్రదాతగానే నిలుస్తారన్నారు. ప్రత్యేక రాష్ట్ర సాధనకు జయశంకర్ చేసిన సేవలు చిరస్మరణీయమని, వ్యవయసాయ యూనివర్సిటీకి ప్రొఫెసర్ జయశంకర్ పేరు పెట్టుకున్నామని, రాష్ట్ర వ్యాప్తంగా ఆయన విగ్రహాలను ఏర్పాటు చేసుకొని ప్రతీ ఏటా ఆయన జయంతి వేడుకలను నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. స్వరాష్ట్రంలో నీళ్లు.. నిధులు.. నియామకాలు అనే తెలంగాణ ఆకాంక్షలు నెరవేరాయన్నారు.
ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ కొరిపెల్లి విజయలక్ష్మి రెడ్డి, కలెక్టర్ ముష్రఫ్ అలీ ఫారూఖీ, అదనపు కలెక్టర్ హేమంత్ బొర్కడే, నిర్మల్ మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎర్రవోతు రాజేందర్, నిర్మల్ పట్టణ టీఆర్ఎస్ అధ్యక్షులు మారుగోండ రాము, కౌన్సిలర్లు, ఇతర ప్రజాప్రతినిదులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tyson Naidu | బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ‘టైసన్ నాయుడు’ నుంచి ‘మదరాసి రబ్బరు బొమ్మ’ మాస్ ఫోక్ సాంగ్ అప్డేట్!
AP News | మురసు తుపాను ఎఫెక్ట్.. రేపు కూడా పలు జిల్లాల్లో భారీ వర్షాలు..!
Ear Wax | గులిమి అంటే ఏమిటి.. దీని వల్ల లాభమా, నష్టమా.. తరచూ తొలగించాలా..?
Health tips | గుండె పదిలంగా ఉండాలంటే వంటలో తరచూ ఈ మార్పులు చేయాల్సిందే..!
AP News | జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు రేపే పోలింగ్.. సర్వం సిద్ధం చేశామన్న ఎన్నికల కమిషనర్..!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

