టీఆర్ఎస్దే విజయం: మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
MLC Elections | స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతున్నది. నిర్మల్ జిల్లా కేంద్రంలోని పోలింగ్ కేంద్రంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఓటుహక్కు వినియోగించుకున్నారు.

నిర్మల్: స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతున్నది. నిర్మల్ జిల్లా కేంద్రంలోని పోలింగ్ కేంద్రంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీదే విజయమని స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో దండే విఠల్ భారీ మెజార్టీతో గెలవబోతున్నారని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. ఆదిలాబాద్ లో ఎమ్మెల్యే జోగు రామన్న ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ఐదు ఉమ్మడి జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతున్నది. నల్లగొండ జిల్లాలోని 8 కేంద్రాల్లో పోలింగ్ ప్రారంభమైంది. మొత్తం 1271 మంది ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకుంటారు. వీరిలో 19 మంది ఎక్స్ అఫిషియో ఓటర్లు ఉన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి ఎంసీ కోటిరెడ్డితో పాటు మరో ఆరుగురు స్వతంత్ర అభ్యర్ధులు బరిలో ఉన్నారు. సాయంత్రం నాలుగు గంటలకు పోలింగ్ ముగియనుంది. పోలింగ్ అనంతరం అన్ని బ్యాలెట్ బాక్స్‌లను నల్లగొండలోని మహిళ డిగ్రీ కాలేజీ ప్రాంగణంలో ఏర్పాటుచేసిన స్ట్రాంగ్ రూమ్‌కు తరలించనున్నారు.

Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

