Minister Indrakaran Reddy | ఆన్లైన్లో బాసర సరస్వతీ అమ్మవారి ఆలయ సేవలు : మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి
Minister Indrakaran Reddy |
Minister Indrakaran Reddy | ఆన్లైన్లో బాసర సరస్వతీ అమ్మవారి ఆలయ, ఈ- హుండీ సేవలను దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాల్లో దశలవారీగా ఆన్లైన్ సేవలను విస్తరిస్తున్నామని తెలిపారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలను కల్పించడంతోపాటు వారి సౌకర్యార్ధం ప్రధాన ఆలయాల్లో ఆన్లైన్లో పూజలు, వసతి బుకింగ్, ప్రసాదం పంపిణీ, తదితర సేవలను భక్తులకు అందుబాటులోకి తెచ్చామని పేర్కొన్నారు. ఆన్లైన్ సేవలతో అమ్మవారి సేవలను పారదర్శకంగా, సులభంగా పొందగలుగుతారని చెప్పారు.
భక్తులకు సేవలు ఆఫ్‌లైన్‌తో పాటు ఆన్లైన్లో కూడా కొనసాగుతాయని స్పష్టం చేశారు. ఏప్రిల్ 1 నుంచి బాసరలో ఆన్లైలైన్ సేవలు భక్తులకు అందుబాటులోకి వచ్చే విధంగా అధికారుల చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. అదే విధంగా ఈ- హుండీ సేవలను భక్తులకు అందుబాటులోకి తెచ్చామని, డిజిటల్ కరెన్సీ వినియోగం పెరిగినందున భక్తుల సౌకర్యార్థం ఈ సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు చెప్పారు. పేటీఎం, ఫోన్ పే, జీపే లాంటి యూపీఐల ద్వారా హుండీ కానుకలు చెల్లించవచ్చన్నారు. అంతకు ముందు మంత్రి మంత్రి సరస్వతీ అమ్మవారి ని దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేశారు. మంత్రికి ఆలయ అర్చకులు, అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, ఆలయ ఈవో విజయ రామారావు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

