Minister IK Reddy | జనావాసాల మధ్య ఇథానల్ పరిశ్రమను ఏర్పాటు చేయొద్దు : మంత్రి ఐకే రెడ్డి
Minister IK Reddy | నిర్మల్ జిల్లా దిలావర్పూర్ గ్రామ పరిసర ప్రాంతంలో జనావాసాల్లో నిర్మించ తలపెట్టిన ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటును విరమించుకోవాలని, జనావాసాలకు దూరంగా పరిశ్రమను నెలకొల్పితే మాకు ఎలాంటి అభ్యంతరం లేదని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి స్పష్టం చేశారు.
నిర్మల్, జూలై 18: నిర్మల్ జిల్లా దిలావర్పూర్ గ్రామ పరిసర ప్రాంతంలో జనావాసాల్లో నిర్మించ తలపెట్టిన ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటును విరమించుకోవాలని, జనావాసాలకు దూరంగా పరిశ్రమను నెలకొల్పితే మాకు ఎలాంటి అభ్యంతరం లేదని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి స్పష్టం చేశారు. ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటును వ్యతిరేకిస్తూ.. దిలావర్ పూర్ మండల రైతులు క్యాంప్ కార్యాయలంలో మంత్రి ఇంద్రకరకణ్ రెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించారు.
పరిశ్రమ ఏర్పాటు వలన ప్రజల అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉందని, పంట పొలాల్లోకి వ్యర్థాలు చేరుతాయని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వారికి సంఘీభావం తెలిపారు. రైతులు, ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని స్థానిక ఎమ్మెల్యేగా వారికి అండగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు.
జనావాసాల్లో కాకుండా , జనావాసాలకు దూరంగా పరిశ్రమ ఏర్పాటు చేస్తే మాకు ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టతనిచ్చారు. కేంద్ర ప్రభుత్వం స్థానిక ప్రజల అభిప్రాయాలను సేకరించి, అనుమానాలను నివృత్తి చేసి అనువైన ప్రాంతంలో ఇథానాల్ పరిశ్రమను ఏర్పాటు చేయాల్సి ఉండేదన్నారు. అలా చేయనందు వల్లే రైతులు ఇక్కడ పరిశ్రమను వ్యతిరేకిస్తున్నారని వ్యాఖ్యానించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

