తెలంగాణ ప్రభుత్వంపై ఇంటర్నేషనల్ హాస్పిటల్స్ గ్రూప్ ప్రశంసలు
హైదరాబాద్ : తెలంగాణలో పెద్ద మొత్తంలో మెడికల్ కాలేజీలు, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు నిర్మిస్తున్న నేపథ్యంలో ఇంటర్నేషనల్ హాస్పిటల్స్ గ్రూప్ ప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు. సాంకేతిక సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని వారు స్పష్టం చేశారు. యుకేకు చెందిన ఇంటర్నేషనల్ హాస్పిటల్స్ గ్రూప్ ప్రపంచ వ్యాప్తంగా హెల్త్ కేర్ సర్వీస్ అందిస్తున్నది. 55 దేశాల్లో 480 హెల్త్ కేర్ ప్రాజెక్ట్స్ పూర్తి చేసింది.
రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావుతో బ్రిటిష్ హై కమిషనర్ ఆండ్రూ ఫ్లెమింగ్, ఇంటర్నేషనల్ హస్పిటల్స్ గ్రూప్ సీఈవో చేస్టర్ కింగ్, సీవోవో సైమన్ ఆశ్వర్త్, భారత ప్రతినిధి పృథ్వి సహాని, ఇతర ప్రతినిధులు భేటీ అయ్యారు.

ఈ సందర్భంగా ఆండ్రూ ఫ్లెమింగ్ మాట్లాడుతూ.. తెలంగాణ అన్ని రంగాల్లో దూసుకుపోతున్నది. ఇక్కడి ప్రభుత్వం కృషి వల్ల హైదరాబాద్ అభివృద్దికి మారుపేరుగా నిలిచింది. ప్రపంచ స్థాయి కంపెనీలు ఇక్కడ పెట్టుబడులు పెడుతున్నాయి. ఈ క్రమంలో ఐహెచ్‌జీ ఆసక్తి చూపిస్తున్నది అని ఆండ్రూ ఫ్లెమింగ్ తెలిపారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని, తెలంగాణలో ఏర్పాటు చేస్తున్న టిమ్స్, మెడికల్ కాలేజీలు, వరంగల్ మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి తదితర అంశాల గురించి మంత్రి హరీశ్‌రావు వారికి వివరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

