వారికి గుర్తుగా మొక్కను నాటి.. స్మరించుకోండి : హరీశ్‌రావు
Minister Harish Rao | చనిపోయిన వారికి గుర్తుగా ఒక మొక్కను నాటి.. వారిని స్మరించుకోవాలని మంత్రి హరీశ్‌రావు అన్నారు. హైదరాబాద్ నెక్లెస్‌రోడ్‌లో 12వ గ్రాండ్ నర్సరీ మేళాను గురువారం ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి ప్రారంభించారు. ఈ నెల 22 వరకు నర్సరీ మేళా కొనసాగనుండగా.. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచి 140పైగా స్టాళ్లు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మేళాను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. నగర వాసులకు ఇదో మంచి అవకాశమని, హోంగార్డెన్, టెర్రస్ గార్డెన్, వర్టికల్ గార్డెన్, కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేసుకోవాలనుకునే వారికి ఇదో మంచివేదిక అన్నారు. నర్సరీలతో మేలు జాతి మొక్కలు, అంటుకట్టిన మొక్కలు అందుబాటులోకి వచ్చాయన్నారు.
తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ దిగుబడి వచ్చే మొక్కలు నర్సరీల్లో అందుబాటులో ఉన్నాయి. ఇలాంటి నర్సరీలతో నగరాలు, పట్టణాలలో మిద్దెతోటల సాగు పెరుగుతుందన్నారు. దీనితో పర్యావరణ పరిరక్షణకు తోడ్పాటునందించినట్లవుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా నర్సరీలను ప్రోత్సహిస్తుందన్నారు. గతంలో నర్సరీలు అంటే ఎవరికి తెలిసేవి కాదు అనేక మేలు జాతి మొక్కలు నర్సరీల్లో అందుబాటులో ఉన్నాయన్నారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు నియోజక వర్గానికి కూడా నర్సరీ ఉండేది కాదని, గత ప్రభుత్వాల హయాంలో ఒక మొక్క నాటి ఫొటోలు దిగేవారన్నారు.
గ్రీన్ టాక్స్ పెట్టి ప్రకృతి వనాల పెంపకానికి ప్రభుత్వం తరఫున తోడ్పాటు ఇస్తున్నామన్నారు. సీఎం కేసీఆర్ ఆలోచనతో తెలంగాణకు హరితహారంలో భాగంగా రాష్ట్రంలోని మొత్తం 12,751 గ్రామాల్లో పల్లె ప్రకృతి వనాల పేరిట నర్సరీలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. దేశంలో ఇంత మొత్తంలో ఎక్కడా జరగటం లేదని, రాష్ట్ర విస్తీర్ణంలో 24 శాతం ఉన్న పచ్చదనాన్ని 33శాతానికి పెంచుకునే లక్ష్యంతో హరితహారం ప్రారంభమైందన్నారు. ప్రస్తుతానికి పచ్చదనం 7.6 శాతం పెరిగి 31.6 శాతానికి చేరిందని.. ఇవి కేంద్రం చెప్పిన లెక్కలన్నారు. సీఎం కేసీఆర్ భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకొని మొక్కల పెంపకమని చెప్పారన్నారు.
అడవులను పునరుజ్జీవం చేశారని, ఈ నెల 21న భారత వజ్రోత్సవాల్లో భాగంగా పెద్ద ఎత్తున హరితహారం కార్యక్రమం చేయాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారని, అందరూ భాగస్వామ్యం కావాలని కోరుతున్నానన్నారు. పిల్లల జన్మదినం రోజున మొక్కలు నాటాలని.. పిల్లలతో కలిసి మొక్కలను పెంచాలన్నారు. పచ్చదనం కాపాడడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. చక్కటి ఆరోగ్యాన్ని, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని పొందేందుకు ఇంట్లో మొక్కలు పెంచుకోవాలన్నారు. పిల్లలకు మనమేమిచ్చినా ఇవ్వకపోయినా.. మంచి వాతావరణం, మంచి ఆరోగ్యాన్ని మాత్రం ఇవ్వాలని హరీశ్‌రావు పిలుపునిచ్చారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

