Minister Harish Rao | గవర్నర్ గారు.. ఇదేం పద్ధతి..? బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో విధానం.. బీజేపీయేతర రాష్ట్రాల్లో మరో విధానమా ? : హరీశ్‌రావు
Minister Harish Rao | బీఆర్ఎస్ నేతలు దాసోజు శ్రావణ్‌కుమార్, కుర్రా సత్యనారాయణల ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాన్ని తిరస్కరిస్తూ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ తీసుకున్న నిర్ణయం దారుణమని మంత్రి హరీశ్‌రావు అన్నారు. సమాజంలోని అత్యంత వెనుకబడిన వర్గాల నుంచి వచ్చిన ఇద్దరు దశాబ్దాలుగా ప్రజాసేవలో ఉన్నారన్నారు.
Minister Harish Rao | బీఆర్ఎస్ నేతలు దాసోజు శ్రావణ్‌కుమార్, కుర్రా సత్యనారాయణల ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాన్ని తిరస్కరిస్తూ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ తీసుకున్న నిర్ణయం దారుణమని మంత్రి హరీశ్‌రావు అన్నారు. సమాజంలోని అత్యంత వెనుకబడిన వర్గాల నుంచి వచ్చిన ఇద్దరు దశాబ్దాలుగా ప్రజాసేవలో ఉన్నారన్నారు. తమ తమ రంగాల్లో ప్రజలకు మేలుచేసే అనేక సేవా కార్యక్రమాలను చేపట్టారన్నారు. అలాంటివారిని తెలంగాణ ప్రభుత్వం గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా అవకాశం కల్పిస్తే.. గవర్నర్ బీఆర్ఎస్లో సభ్యులుగా ఉండడంతో అనర్హులనడం దారుణమన్నారు.
ఒకవేళ ఇదే అయితే, తమిళనాడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలిగా ఉన్న తమిళిసై తెలంగాణ గవర్నర్‌గా ఎలా ఉంటారని ప్రశ్నించారు. పార్టీ అధ్యక్షురాలిగా ఉన్న వ్యక్తికి రాష్ట్ర గవర్నర్ పదవి ఇవ్వొచ్చా? అని నిలదీశారు. సర్కారియా కమిషన్ ప్రతిపాదనలను బట్టి చూస్తే గవర్నర్ పదవిలో తమిళిసై ఉండొద్దని.. మరి ఆమె ఎలా ఉన్నారని సూటిగా ప్రశ్నించారు. బీజేపీ పార్టీకి చెందిన గులాం అలీ ఖతానాను రాష్ట్రపతి కోటాలో రాజ్యసభకు పంపలేదా..? అని నిలదీశారు. బీజేపీ నేత మహేశ్ జఠ్మలానీ, సోనాల్ మాన్సింగ్, రాంషఖల్, రాకేశ్ సిన్హా ఇలా వీళ్లంతా బీజేపీలో పనిచేయలేదా..? వీరిని ఎలా రాష్ట్రపతి కోటాలో రాజ్యసభ సభ్యులగా నియమించారన్నారు.
బీజేపీ అధికారంలో ఉన్న ఉత్తర్‌ప్రదేశ్‌లో జితిన్ ప్రసాద్, గోపాల్ అర్జున్ బూర్జీ, చౌదరీ వీరేంద్ర సింగ్, రజనీకాంత్ మహేశ్వరీ, సాకేత్ మిశ్రా, హన్స్‌రాజ్ విశ్వకర్మ ఇలా అనేక మందిని గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నియమించిన విషయాన్ని గుర్తు చేశారు. వీరంతా బీజేపీలో ప్రత్యక్షంగా ఉన్నవారే కదా..? అన్నారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఒక విధానం.. బీజేపీతో కలిసిలేని రాష్ట్రాల్లో మరో విధానం అమలు చేస్తారా..? ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వానికి ఒక నీతి.. బీజేపీయేతర రాష్ట్రాలకు మరోనీతి ఉంటుందా..? అన్నారు.
తెలంగాణ విషయంలో గవర్నర్ వైఖరిలో మార్పు లేదని, నిజంగా తెలంగాణ ప్రభుత్వం తప్పు చేస్తే గవర్నర్ సరిచేస్తే ఏమో అనుకోవచ్చు.. కానీ, నీతి, నిజాయితీతో పనిచేస్తే కూడా గవర్నర్ కక్షపూరితంగా వ్యవహరించడం సరికాదన్నారు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం చేసిన బిల్లులను ఆపారని, రెండేసిసార్లు బిల్లులను పంపినా వాటిని ఆమోదించలేదన్నారు. ఇప్పుడేమో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలను తిరస్కరించడం మరీ దారుణమని, తెలంగాణ ప్రజలు అన్నింటిని గమనిస్తున్నారన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
Sensory Overload | సెన్సరీ ఓవర్‌లోడ్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. తగ్గేందుకు ఏం చేయాలి..?
Vijay Deverakonda | ట్యాంక్‌బండ్‌పై విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నేడు సద్దుల బతుకమ్మ వేడుకలకు ‘విరోష్’ జంట!
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

