కాంగ్రెసోళ్లవి సిగ్గులేని మాటలు
“యాభై ఏండ్ల కాంగ్రెస్ పాలనలో రైతుల ఆత్మహత్యలు, ఆకలి చావులు, బీడు భూములు ఉండేవి. అప్పట్లో యాసంగిలో ట్రాన్స్ఫార్మర్ కాలకుండా, మోటారు కాలిపోకుండా ఏ ఒక్క రైతు అయినా పంట పండించాడా? ఇప్పుడేమో కేసీఆర్ కరెంటు సరిగ్గా ఇస్తలేడని కాంగ్రెసోళ్లు సిగ్గులేకుండా మాట్లాడుతున్నారు” అని మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. శనివారం సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెటలో 62 ఎకరాల విస్తీర్ణంలో రూ. 300 కోట్లతో ఆయిల్‌పాం కర్మాగారానికి భూమిపూజ చేశారు.
- వాళ్లను ఏమనాలో అర్థంకావట్లే
- హస్తం పార్టీ పాలనలో రైతుల ఆత్మహత్యలు, ఆకలిచావులు
- ఆయిల్‌పాంతో రైతులకు ఆదాయం
- ఐదు సంవత్సరాల్లో 20 లక్షల ఎకరాల్లో సాగు లక్ష్యం
- సీఎం కేసీఆర్‌కు దైవ సంకల్పం ఉంది
- మంత్రి తన్నీరు హరీశ్‌రావు
- నర్మెటలో రూ. 300 కోట్లతో పామాయిల్ కర్మాగారం ఏర్పాటుకు హరీశ్ భూమిపూజ
సిద్దిపేట, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): “యాభై ఏండ్ల కాంగ్రెస్ పాలనలో రైతుల ఆత్మహత్యలు, ఆకలి చావులు, బీడు భూములు ఉండేవి. అప్పట్లో యాసంగిలో ట్రాన్స్ఫార్మర్ కాలకుండా, మోటారు కాలిపోకుండా ఏ ఒక్క రైతు అయినా పంట పండించాడా? ఇప్పుడేమో కేసీఆర్ కరెంటు సరిగ్గా ఇస్తలేడని కాంగ్రెసోళ్లు సిగ్గులేకుండా మాట్లాడుతున్నారు” అని మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. శనివారం సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెటలో 62 ఎకరాల విస్తీర్ణంలో రూ. 300 కోట్లతో ఆయిల్‌పాం కర్మాగారానికి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. గతంలో మీరు పాలించినప్పుడు పొద్దంతా కరెంట్ ఉందా? అని కాంగ్రెస్ నాయకులను నిలదీశారు. ఉచిత కరెంట్ అని ఉత్త కరెంట్ చేసిండ్రు. పొద్దుందాక మూడు గంటల కరెంట్ రాకపోతుండే అని పేర్కొన్నారు. ఇప్పుడేమో మూడు గంటలు కరెంటిస్తే మూడు ఎకరాలు పారుతుందని మాట్లాడుతున్న వీళ్లను ఏమనాలో అర్థం కావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు
. గిసొంటోళ్లు రేపు ఈ రాష్ర్టాన్ని పాలించగలుగుతారా? అని రైతులు ఆలోచించాలని కోరారు. రైతే రాజన్న నినాదాన్ని సీఎం కేసీఆర్ నిజం చేశారని పేర్కొన్నారు. రైతుల ఆత్మహత్యలను నివారించి వారి పిల్లలు డాక్టర్లుగా, ఇంజినీర్లుగా చదువుకునే పరిస్థితులు కల్పించారని వివరించారు. రాష్ట్రంలో 24 లక్షల పంపుసెట్లు నడుస్తున్నాయని తెలిపారు. నీటి తీరువా, కరెంటు బిల్లు లేదని, పైపెచ్చు సీఎం కేసీఆరే ఎదురు ఇస్తున్నారని పేర్కొన్నారు. 60 ఏండ్లలో కాంగ్రెస్ పార్టీ ఏనాడైనా ఈ రకంగా ఆలోచించిందా? దేశంలో ఎక్కడైనా బీజేపీ ప్రభుత్వం ఇస్తున్నదా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్, బీజేపీ వల్ల దేశం ఎంతగానో నష్టపోతున్నదని మంత్రి హరీశ్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి సంవత్సరం విదేశాల నుంచి మనం రూ. 1.56 వేల కోట్ల విలువైన మంచినూనెను దిగుమతి చేసుకుంటున్నట్టు తెలిపారు. దేశానికి అవసరమైన మంచినూనెలో మనదగ్గర 40 శాతం మాత్రమే ఉత్పత్తి అవుతున్నదని పేర్కొన్నారు.
ఆయిల్‌పాం సాగు.. రైతున్న ఆదాయం బాగు
అయిల్‌పాం సాగు రైతులకు అభయహస్తం లాంటిదని మంత్రి పేర్కొన్నారు. ‘ఆయిల్‌పాం సాగు.. రైతన్న ఆదాయం బాగు’ అనే నినాదాం పెట్టుకోవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. వరి పంటకు గ్యారెంటీ లేదని, అకాల వర్షాలు, ఇతర కారణాలతో అది దెబ్బతినే అవకాశం ఉందన్నారు. కానీ, పామాయిల తోటలకు అలాంటి ఇబ్బందులు ఉండవని తెలిపారు. జనం ఉన్నంత వరకు నూనె కావాలని, పామాయిల్ పంటకు ఫుల్ డిమాండ్ ఉంటుందని వివరించారు. రాష్ట్రంలో 20 లక్షల ఎకరాల్లో పామాయిల్ తోటలు సాగు చేయాలని సీఎం కేసీఆర్ లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు. ఆయిల్‌పాం ప్రెస్సింగ్ తర్వాత మిగిలిన పొట్టును కోళ్లకు, పశువులకు దాణా తయారుచేసే కర్మాగారం కూడా అంతర్భాగంగా నిర్మించబోతున్నట్టు పేర్కొన్నారు.
మిగిలిన పిప్పితో విద్యుత్తు తయారీ కేంద్రాన్ని కూడా నిర్మిస్తామన్నారు. ఇంత మంచి అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్, వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి, ఆయిల్ ఫెడ్ సంస్థకు రైతుల పక్షాన మంత్రి హరీశ్‌రావు ధన్యవాదాలు తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు లేకుంటే ఆయిల్‌పాం సాగు జరిగేదే కాదని తెలిపారు. సముద్రతీరం ఉన్న చోటనే పామాయిల్ తోటలు ఉన్నాయన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా పెద్ద ఎత్తున రిజర్వాయర్లు నిర్మించుకొని చెరువులు, చెక్‌డ్యామ్‌లు నింపుకోవడంతో ఆయిల్పాంసాగుకు అనుకూలమైన వాతావరణం ఏర్పడినట్టు వివరించారు. ‘సీఎం కేసీఆర్‌కు దైవసంకల్పం ఉందని, అందుకనే ఈ 9 ఏండ్లలో ఏనాడూ కరువు రాలేదని అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉద్యానవనశాఖ కార్యదర్శి హన్మంతరావు, జడ్పీ చైర్పర్సన్ వేలేటి రోజారాధాకృష్ణశర్మ, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, ఎమ్మెల్యే వొడితెల సతీశ్, అటవీ సంస్థ చైర్మన్ ప్రతాప్‌రెడ్డి, ఆయిల్‌ఫెడ్ ఎండీ సురేందర్, ఆయిల్‌ఫెడ్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి, వైస్ చైర్మన్ సోంరెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.
షీటీమ్స్, సఖీ కేంద్రాలు దేశానికే ఆదర్శం
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత 2014లో ప్రారంభించిన షీటీమ్స్, సఖీ, భరోసా కేంద్రాలు దేశానికే ఆదర్శంగా మారాయని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లాలోని సిద్దిపేట రూరల్ పోలీస్ స్టేషన్ ఆవరణలో సఖీ, భరోసా భవనాలను శనివారం డీజీపీ అంజనీకుమార్, అడిషనల్ డీజీపీ, ఉమెన్ సేప్టీ హెడ్ షికాగోయల్, డీఐజీ రమేశ్, కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, పోలీస్ కమిషనర్ శ్వేతతో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. బాధితులు ఎవరైనా ఇకడికి వచ్చి అన్ని రకాలుగా న్యాయం పొందవచ్చన్నారు. ఇకడ బాధితులకు వైద్యం, న్యాయం, రక్షణ కల్పిస్తుందని తెలిపారు. సీఎం కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా పోలీస్ శాఖ పనిచేస్తున్నదన్నారు. సిద్దిపేటలో భరోసా, సఖీ సెంటర్లు ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. దేశంలో తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే ప్రతి పోలీస్ స్టేషన్లో మహిళా విభాగం ఏర్పాటు చేసినట్టు మంత్రి తెలిపారు. డీజీపీ అంజనీకుమార్ మాట్లాడుతూ..రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం కమిట్మెంట్తో పనిచేస్తున్నదన్నారు. అడిషనల్ డీజీపీ షికా గోయల్ మాట్లాడుతూ..హైదరాబాద్ అందరికీ సేఫ్టీ నగరమని అన్నారు
3 నెలల చిన్నారికి నామకరణం
సిద్దిపేటలో రూ. 30 లక్షలతో నిర్మించిన శిశుగృహను శనివారం మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. అనంతరం .శిశుగృహలో అనాథ శిశువులను మంత్రి హరీశ్‌రావు పరిశీలిస్తున్న క్రమంలో ఓ చిన్నారికి శ్రీ అని నామకరణం చేసి కాసేపు ఎత్తుకుని లాలించారు. సిద్దిపేట అర్బన్ మండలం బూరుగుపల్లి శివారులో నిరుపేద తల్లి 3 నెలల ఈ చిన్నారిని విక్రయిస్తుండగా జిల్లా బాలల సంరక్షణ అధికారులు తల్లి నుంచి స్వాధీనం చేసుకుని శిశుగృహలో చేర్పించారు. చిన్నారికి పేరు పెట్టిన మంత్రి.. శ్రీజ ముఖంలో చిరునవ్వులు వెల్లివిరియాలని, నిండునూరేళ్లు సుఖసంతోషాలతో జీవించేలని ఆశీర్వదించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Punjab Drug | పంజాబ్‌లో పిజ్జా కన్నా వేగంగా డ్రగ్స్ డెలివరీ.. ఆప్, బీజేపీపై సచిన్ పైలట్ ధ్వజం
Chiranjeevi | మూవీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. వైజాగ్‌లో చిరంజీవి నయా ప్లాన్..!
ఎన్సీడబ్ల్యూఏ ఉద్యోగులకు క్వార్టర్స్ కేటాయింపు
Karikaala | ‘కరికాల’ నా కెరీర్ బెస్ట్ మూవీ అవుతుంది.. పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన సందీప్ కిషన్ పాన్-ఇండియా చిత్రం
‘విద్యుత్ భద్రతలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

