ఉచితాలు వద్దంటున్న బీజేపీని రాజకీయంగా సమాధి చేయాలి : మంత్రి హరీశ్‌రావు
Harish Rao | గ్యాస్, పెట్రోల్ ధరలను పెంచి సామాన్య ప్రజల జీవితాలను బీజేపీ ఛిద్రం చేసిందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో మునుగోడు నియోజకవర్గం నాంపల్లిలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ తీరుపై మంత్రి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
నాంపల్లి: గ్యాస్, పెట్రోల్ ధరలను పెంచి సామాన్య ప్రజల జీవితాలను బీజేపీ ఛిద్రం చేసిందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో మునుగోడు నియోజకవర్గం నాంపల్లిలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ తీరుపై మంత్రి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
రూ.18వేల కోట్లకు అమ్ముడుపోయిన రాజగోపాల్ రెడ్డికి ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలన్నారు. ‘‘బోరు బావులకు మీటర్లు పెట్టమని బీజేపీ లెటర్ పంపింది. అన్నదాతలు జాగ్రత్తగా ఆలోచన చెయ్యాలి. మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీకి తగిన గుణపాఠం చెప్పాలి. వడ్లు కొనమంటే చేతకాని దద్దమ్మలు బీజేపీ వాళ్లు. తెలంగాణ ప్రజలను నూకలు తినమని చెప్పి అవమానించారు. ఉచితాలు వద్దు అని చెప్తున్న బీజేపీని రాజకీయంగా సమాధి చేయాలి. ఎమ్మెల్యేలను వందల కోట్లతో కొనాలని చూశారు. కేసీఆర్ దెబ్బకు ఢిల్లీ పెద్దలు ముఖం చాటేశారు. మునుగోడులో టీఆర్ఎస్ భారీ మెజారిటీతో గెలుస్తుంది. నవంబర్ 6న టీఆర్ఎస్ ప్రభంజనం సృష్టిస్తోంది’’ అని అన్నారు.
భగీరథ ద్వారా ఇంటింటికీ నదీ జలాలను అందించిన ముఖ్యమంత్రి కేసీఆర్ వెంట అందరూ నడవాలని ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు పిలుపునిచ్చారు. తెలంగాణ సాధించిన మహానుభావుడు మన కేసీఆర్ అని.. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం గెలవాలంటే టీఆర్ఎస్ని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. టీఆర్ఎస్ను ఆశీర్వదిస్తే సాగు నాటి ప్రాజెక్టులు పూర్తి చేసి పొలాలకు నీళ్లు అందిస్తామన్నారు. మహిళా భవనాలను నిర్మిస్తామని మంత్రి పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

