Minister Harish Rao | అంతర్జాతీయ మెడికల్ హబ్‌గా హైదరాబాద్: మంత్రి హరీశ్ రావు
హైదరాబాద్ మెడికల్ హబ్‌గా మారనున్నదని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు చెప్పారు. ఇప్పటికే హైదరాబాద్ ఫార్మా హబ్‌గా, వ్యాక్సిన్ హబ్‌గా, ఐటీ హబ్‌గా కొనసాగుతున్నదని, అతి త్వరలోనే మెడికల్ హబ్‌గా మారుతుందని తెలిపారు.
- ఇప్పటికే ఫార్మా హబ్‌గా, వ్యాక్సిన్
- హబ్‌గా, ఐటీ హబ్ మారిన నగరం
- పెరుగుతున్న మెడికల్ టూరిజం
- అరీట్ దవాఖాన ప్రారంభోత్సవంలో వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు
Minister Harish Rao | కొండాపూర్, సెప్టెంబర్ 24: హైదరాబాద్ మెడికల్ హబ్‌గా మారనున్నదని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు చెప్పారు. ఇప్పటికే హైదరాబాద్ ఫార్మా హబ్‌గా, వ్యాక్సిన్ హబ్‌గా, ఐటీ హబ్‌గా కొనసాగుతున్నదని, అతి త్వరలోనే మెడికల్ హబ్‌గా మారుతుందని తెలిపారు. హైదరాబాద్‌లోని బయోడైవర్సిటీ సమీపంలో నెలకొల్పిన అరీట్ మల్టి స్పెషాలిటీ దవాఖానను ఆదివారం చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. ఇప్పటికే నగరానికి రాష్ట్రంతోపాటు ఇతర రాష్ర్టాలు, దేశాల నుంచి ప్రజలు వైద్య సేవల కోసం వస్తున్నారని చెప్పారు.
కార్పొరేట్‌కు దీటుగా ప్రభుత్వ దవాఖానల్లో సేవలందించేలా రాష్ట్ర సర్కారు చర్యలు తీసుకుంటున్నదని తెలిపారు. రాష్ర్టానికి దేశ, విదేశాల నుంచి రోగులు వస్తుండటంతో మెడికల్ టూరిజం పెరుగుతున్నదని వెల్లడించారు. తద్వారా ఎంతో మందికి ఉపాధి లభిస్తున్నదని తెలిపారు. అరీట్ దవాఖాన యాజమాన్యం రోగులకు మెరుగైన వైద్య సేవలందించడంతోపాటు పేద, మధ్య తరగతి ప్రజలకు అందుబాటులో వైద్య సేవలందించేందుకు కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో దవాఖాన చైర్మన్ డాక్టర్ విజయేందర్‌రెడ్డి తీగల, మేనేజింగ్ డైరెక్టర్ గుత్తా, డైరెక్టర్ డాక్టర్ శ్రీకాంత్ వేముల తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kaaka | చిరంజీవి చేతిలో కొడవలి, రక్తంతో తడిసిన ఆయుధం.. ‘కాకా’ నుంచి ఊచకోత పోస్టర్
Gajulapeta Villagers | పట్టించుకోని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి.. బీటీ రోడ్డు రెన్యువల్ కోసం గాజులపేట గ్రామస్తుల పాదయాత్ర
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

