Minister Gangula | కరీంనగర్‌ను ఉన్నతంగా తీర్చిదిద్దుతాం : మంత్రి గంగుల
Minister Gangula | రీంనగర్ అభివృద్ధే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం పని చేస్తుందని బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రివ గంగుల కమలాకర్ పేర్కొన్నారు. మంగళవారం కరీంనగర్ నగరపాలక సంస్థ 18వ డివిజన్ రేకుర్తి వెంకటేశ్వర కాలనీలో..కోటి 90 లక్షలతో పలు అభివృద్ధి పనులకు నగర మేయర్ యాదగిరి సునీల్ రావుతో కలిసి మంత్రి భూమి పూజ చేశారు.
కరీంనగర్ : కరీంనగర్ అభివృద్ధే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం పని చేస్తుందని బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రివ గంగుల కమలాకర్ పేర్కొన్నారు. మంగళవారం కరీంనగర్ నగరపాలక సంస్థ 18వ డివిజన్ రేకుర్తి వెంకటేశ్వర కాలనీలో..కోటి 90 లక్షలతో పలు అభివృద్ధి పనులకు నగర మేయర్ యాదగిరి సునీల్ రావుతో కలిసి మంత్రి భూమి పూజ చేశారు. డివిజన్ అభివృద్ధికి నిధులు కేటాయించిన మంత్రికి డివిజన్ వాసులు శాలువాతో సత్కరించారు..
ఈ సందర్భంగా మంత్రి గంగుల మాట్లాడుతూ తెలంగాణలో కరీంనగర్ ను రాష్ట్రంలో రెండో నగరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామన్నారు. నగరపాలక సంస్థలో విలీనం అయిన డివిజన్ల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని వెల్లడించారు. రేకుర్తి గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు అభివృద్ధికి నోచుకోలేదని, రేకుర్తి 18,19 డివిజన్ల అభివృద్ధికి అత్యధికంగా నిధులు కేటాయించామని చెప్పారు.
పనులు పురోగతిలో ఉన్నాయని అన్నారు. ప్రారంభించిన పనులన్నీ నెల రోజుల్లో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని అధికారులను ఆదేశించారు. కరీంనగర్ అభివృద్ధికి ప్రజలు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు సుధగుని మాధవి కృష్ణా గౌడ్, ఏదుల్ల రాజశేఖర్ వి.రాజేందర్ రావు, భూమా గౌడ్, జంగిలి సాగర్ మహేష్ , గుగ్గిళ్ల శ్రీనివాస్, తుల బాలయ్య బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్, మాజీద్, నరేష్, తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

