హైదరాబాద్, జూన్ 12 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని 703 బీసీ ప్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్ హాస్టళ్లలోని సీట్లను ఇకపై పూర్తిగా ఆన్లైన్ ద్వారానే భర్తీ చేయనున్నట్టు బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. ఇందుకోసం రూపొందించిన https://bchostels.cgg.gov.in వెబ్సైట్ను మంత్రి సోమవారం సచివాలయంలో అధికారికంగా ప్రారంభించారు.
ఈ విద్యా సంవత్సరం నుంచే ఈ వెబ్సైట్ అందుబాటులోకి తీసుకొచ్చామని పేర్కొన్నారు. వెబ్సైట్లో సూచించిన ఆన్లైన్ అడ్మిషన్ ఫాం నింపి దరఖాస్తు సమర్పించగానే ఎవరి ప్రమేయం లేకుండా వివరాలు వెరిఫికేషన్ చేసుకొని ప్రవేశం కల్పిస్తామని వెల్లడించారు. కార్యక్రమంలో గీత కార్మిక కార్పొరేషన్ చైర్మన్ పల్లె రవికుమార్, బీసీ సంక్షేమ శాఖ డీడీ సంధ్య ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.