Home
Telangana
Minister Gangula Kamalakar Started His Political Career As A Councilor In Karimnagar Municipality In The Year 2000
కార్పొరేటర్‌గా నిలిచి.. ఎమ్మెల్యేగా గెలిచి
నాయకుడిగా ఎదగాలంటే ఎక్కడో ఒక దగ్గర ప్రస్థానం ప్రారంభం కావాల్సిందే. ఏ పెద్ద లీడర్‌ను తీసుకున్నా గల్లీ లీడర్ నుంచి ఎదిగినవారే. కౌన్సిలర్‌గానో.. కార్పొరేటర్గానో జర్నీ మొదలుపెట్టిన వారే. అంచెలంచెలుగా ఒక స్థాయికి వచ్చినవారే.
- అంచెలంచెలుగా ఎదిగి ఎమ్మెల్యేలు, మంత్రులుగా సేవలు
- తాజాగా ఎన్నికల్లో మళ్లీ బరిలో నిలిచిన పలువురు అభ్యర్థులు
నాయకుడిగా ఎదగాలంటే ఎక్కడో ఒక దగ్గర ప్రస్థానం ప్రారంభం కావాల్సిందే. ఏ పెద్ద లీడర్‌ను తీసుకున్నా గల్లీ లీడర్ నుంచి ఎదిగినవారే. కౌన్సిలర్‌గానో.. కార్పొరేటర్గానో జర్నీ మొదలుపెట్టిన వారే. అంచెలంచెలుగా ఒక స్థాయికి వచ్చినవారే. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో తలపడుతున్న వారిలో ఇదే కోవకు చెందినవారు చాలా మందే ఉన్నారు. వారెవరెవరో ఓ లుక్కేద్దాం.
తాజాగా బరిలో నిలిచినవారు…
- మంత్రి గంగుల కమలాకర్ కరీంనగర్ మున్సిపాలిటీలో 2000 సంవత్సరంలో కౌన్సిలర్‌గా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. తర్వాత కార్పొరేటర్‌గా గెలిచి, కార్పొరేటర్‌గానే అసెంబ్లీ ఎన్నికల్లో తలపడి విజయం సాధించారు. కరీంనగర్ సెగ్మెంట్ నుంచి హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేయడమే కాకుండా ప్రస్తుతం మంత్రిగా కొనసాగుతూ, ఇక్కడి నుంచే నాలుగోసారి పోటీలో ఉన్నారు.
- వరంగల్ ఈస్ట్, వెస్ట్ ఎమ్మెల్యేలు నన్నపునేని నరేందర్, దాస్యం వినయ్భాస్కర్లిద్దరు గతంలో కార్పొరేటర్లుగా గెలిచినవారే. నరేందర్ మేయర్‌గా ఉండి, ఎమ్మెల్యేగా గెలిచారు. వినయ్‌భాస్కర్ హ్యాట్రిక్ విజయాన్ని నమోదుచేశారు. తాజాగా వీరిద్దరూ మరోసారి పోటీ చేస్తున్నారు.
- డిప్యూటీ స్పీకర్, సికింద్రాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి టీ పద్మారావు 1984, 2001ల్లో మున్సిపల్ ఎన్నికల్లో గెలిచారు. సికింద్రాబాద్ నుంచి మూడుసార్లు గెలిచిన పద్మారావు మంత్రిగాను సేవలందించి, అదే స్థానం నుంచి మళ్లీ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
- మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ 1986లో మోండా డివిజన్ నుంచి జనతా పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత సికింద్రాబాద్ నుంచి మూడు సార్లు, సనత్‌నగర్ నుంచి రెండుసార్లు గెలిచి మంత్రిగా సేవలందించారు. తాజా ఎన్నికల్లో సనత్‌నగర్ సెగ్మెంట్ నుంచి బరిలోకి దిగారు.
- ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ జవహర్‌నగర్ డివిజన్ నుంచి కార్పొరేటర్‌గా గెలిచి తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. 2018లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన ముఠా గోపాల్ మళ్లీ ముషీరాబాద్ నుంచే బరిలో నిలిచారు.
- ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి సైతం కార్పొరేటర్‌గానే రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. ఆయన అక్బర్‌బాగ్ నుంచి కార్పొరేటర్‌గా గెలిచి తదనంతరం ఎమ్మెల్యే ఆయ్యారు. రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి, మళ్లీ ఎల్బీనగర్ నుంచే బీఆర్ఎస్ అభ్యర్థిగా తలపడుతున్నారు.
…?కొంటు మల్లేశం
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

