పాలకుర్తిలో ఉచిత శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి ఎర్రబెల్లి
జనగామ : పంచాయతీరాజ్ శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సోమవారం జనగామ జిల్లా పాలకుర్తిలోని బషారత్ గార్డెన్స్‌లో ఎర్రబెల్లి ట్రస్ట్ అధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత ఉపాధి, ఉద్యోగ శిక్షణ శిబిరాన్ని ప్రారంభించారు. పిల్లలకు పెడుతున్న భోజన వసతి ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం శిక్షణకు వచ్చిన ఉద్యోగార్థులతో కలిసి భోజనం చేశారు.
ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ..గత కొన్నేళ్లుగా ఉషా దయాకర్ రావు అధ్వర్యంలో ఎర్రబెల్లి ట్రస్ట్ సేవా కార్యక్రమాలు దిగ్విజయంగా కొనసాగుతున్నాయన్నారు. కరోనా సమయంలో నిరుపేదలకు నిత్యావసర వస్తువులు, అంబులెన్స్ లు వంటివి ఎన్నో చేశాం. అలాగే ఈ ఉచిత ఉపాధి, ఉద్యోగ శిక్షణ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నామన్నారు.

పాలకుర్తి నియోజకవర్గంలోని నిరుద్యోగులకు అందుబాటులో ఉండటానికి వీలుగా అటు తొర్రూరులో తొర్రూరు, రాయపర్తి, పెద్ద వంగర మండలాలకు, ఇటు పాలకుర్తిలో పాలకుర్తి, కొడకండ్ల, దేవరుప్పుల మండలాల వాళ్లకు ఉచిత శిక్షణ ఇస్తున్నామని పేర్కొన్నారు. ఈ శిక్షణ వల్ల ఇప్పటికే చాలా మంది ఉద్యోగాలు పొందారు. మరికొంత మంది ఉద్యోగాలు పొందాలన్నదే మా సంకల్పం అన్నారు.

పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు. కష్టపడి చదవండి. ఇష్టమైన ఉద్యోగాన్ని సాధించండని నిరుద్యోగులకు సూచించారు. ప్రభుత్వ ఉద్యోగాలు పొందాలనే వాళ్లకు ఇది మంచి అవకాశం అన్నారు. ఎర్రబెల్లి ట్రస్ట్ ఆధ్వర్యంలో మరిన్ని శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

