RRR Oscar | ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్‌కు అభినందలు తెలిపిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
RRR Oscar | ఆస్కార్ అవార్డు గెలుచుకున్న ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్‌కు రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు( Errabelli Dayaker Rao ) అభినందనలు తెలిపారు. నాటు నాటు పాట( Naatu Naatu Song ) తెలంగాణ సినిమాని, సంస్కృతిని విశ్వవ్యాప్తం చేసిందని పేర్కొన్నారు.
RRR Oscar | ఆస్కార్ అవార్డు గెలుచుకున్న ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్‌కు రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు( Errabelli Dayaker Rao ) అభినందనలు తెలిపారు. నాటు నాటు పాట( Naatu Naatu Song ) తెలంగాణ సినిమాని, సంస్కృతిని విశ్వవ్యాప్తం చేసిందని పేర్కొన్నారు. నాటు నాటు పాట రాసిన చంద్రబోస్( Chandrabose ), పాడిన రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవకు, నేపథ్య సంగీతం అందించిన కీరవాణి( MM Keeravani ), డైరెక్టర్ రాజమౌళి( SS Rajamouli )కి ఆయన ప్రత్యేక అభినందనలు తెలిపారు.
నాటు నాటుపాట ప్రపంచాన్ని ఆకర్షించడానికి కీలక భూమిక వహించిన కథానాయకులు రామ్ చరణ్( Ram Charan ), జూనియర్ ఎన్టీఆర్( Jr NTR ), కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్‌ను మంత్రి ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించారు. ముఖ్యంగా చంద్రబోస్ మా ఉమ్మడి వరంగల్ జిల్లా ముద్దు బిడ్డ కావడం మాకు గర్వంగా ఉందన్నారు.
తెలంగాణ వచ్చిన తర్వాతే, సీఎం కెసిఆర్ గారి ప్రోత్సాహంతో తెలుగు సినీ పరిశ్రమకు అన్ని విధాలుగా అండదండలు పుష్కలంగా లభిస్తున్నాయని చెప్పారు. భవిష్యత్తులోనూ ఇంకా మంచి సినిమాలు తీసి ప్రపంచ ఖ్యాతిని తెలంగాణకు, తద్వారా దేశానికి అందేలా కృషి చేయాలని మంత్రి ఎర్రబెల్లి ఆకాంక్షించారు. అలాగే, ఆస్కార్ బరిలో బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిమ్స్ కేటగిరిలో గెలిచిన మరో సినిమా ఎలిఫెంట్ విష్పరర్స్ చిత్ర యూనిట్ ని కూడా ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అభినందించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

