Mulugu DMHO | ములుగు డీఎంహెచ్వోను అభినందించిన మంత్రి దామోదర రాజనర్సింహ
Mulugu DMHO | ములుగు జిల్లా డీఎంహెచ్వో అప్పయ్యను(DMHO Appaiah) వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ( Damodara Rajanarsimha) అభినందించారు. అప్పయ్య కొండలు ఎక్కి, వాగులు, వంకలు దాటి ఆదివాసీలకు వైద్య
హైదరాబాద్ : ములుగు జిల్లా డీఎంహెచ్వో అప్పయ్యను(DMHO Appaiah) వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ( Damodara Rajanarsimha) అభినందించారు. అప్పయ్య కొండలు ఎక్కి, వాగులు, వంకలు దాటి ఆదివాసీలకు వైద్య సేవలు అందించిన విధానాన్ని మీడియా ద్వారా తెలుసుకున్న మంత్రి అప్పయ్య సేవలను కొనియాడారు. వివరాల్లోకి వెళ్తే.. ములుగు జిల్లా(Mulugu) వాజేడు మండలంలోని అటవీ ప్రాంతంలోని పెనుగోలు గుట్టపై గిరిజనులు నివసిస్తున్నారు. వాజేడు మండల కేంద్రానికి 16 కిలోమీటర్ల దూరంలో ఉండే ఆ ప్రాంతానికి వెళ్లాలంటే కాలినడకే శరణ్యం. పైగా మూడు గుట్టలెక్కి.. మూడు వాగులు దాటాల్సిందే.
అయితే ఇక్కడి ప్రజలకు వైద్యసేవలందించేందుకు ములుగు డీఎంహెచ్వో అప్పయ్య తన సిబ్బందితో కలిసి మంగళవారం పెనుగోలు గుట్టపైకి చేరుకున్నాడు. అక్కడున్న 10 కుటుంబాలకు చెందిన 39 మందికి దోమ తెరలను అందించడంతో పాటు వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అవసరమైన వైద్య సేవలందించారు. అక్కడి నుంచి బుధవారం మళ్లీ గుట్టలు, వాగులు దాటి కాలినడకన వాజేడుకు సాయంత్రం చేరుకున్నారు. ఓ జిల్లా స్థాయి అధికారి వైద్య సేవలందించేందుకు పెనుగోలు గ్రామానికి 32 కిలోమీటర్లు కాలినడకన వెళ్లి రావడం ఇదే తొలిసారి కావడం విశేషం. అప్పయ్యను అధికారులతో పాటు స్థానికులు అభినందించారు.

Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Power crisis | కాంగ్రెస్ చేతకాని పాలనతో రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం : మాజీ ఎమ్మెల్యే గండ్ర
President Murmu | మహిళలకు మరింత సాధికారత కల్పించేందుకు కృషి చేయాలి : రాష్ట్రపతి ముర్ము
Supreme Court | సీఈసీ జ్ఞానేష్ కుమార్కు సుప్రీంకోర్టు నోటీసులు.. జంతర్ మంతర్పై ఢిల్లీ ప్రభుత్వానికి నోటీసులు
Kalpavruksha Vahanam | కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి దర్శనం..తిరుమలలో వైభవంగా బ్రహ్మోత్సవాలు
Lover | ప్రియుడికి బెయిల్ ఇప్పించేందుకు ప్రియురాలు ఏం చేసిందో తెలుసా..?
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

