Minister Damodar | గురుకుల కార్యదర్శి అలుగు వర్షిణిపై మంత్రి దామోదర సీరియస్
Minister Damodar | సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ కార్యదర్శి అలుగు వర్షిణిపై ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అనాలోచిత నిర్ణయాలతో గురుకుల వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నారని మండిపడ్డారు.
- వసతులు ఎందుకు కల్పించడం లేదని ఆరోగ్యశాఖ మంత్రి ఆగ్రహం
Minister Damodar | హైదరాబాద్, మే 21 (నమస్తే తెలంగాణ): సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ కార్యదర్శి అలుగు వర్షిణిపై ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అనాలోచిత నిర్ణయాలతో గురుకుల వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నారని మండిపడ్డారు. ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు వసతి కల్పించాలని ఆదేశించారు. నేటి నుంచి ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం కానున్నాయి.
అన్ని గురుకులాలు పరీక్షలు రాసే తమ విద్యార్థులకు భోజన, వాహన వసతులు కల్పిస్తున్నాయి. ఎస్సీ గురుకుల సొసైటీ మాత్రం ఎలాంటి వసతులు కల్పించకపోవడంతో విషయాన్ని జై భీమ్ యూత్ ఇండియా ప్రెసిడెంట్ శ్రీహరి ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనరసింహ దృష్టికి తీసుకెళ్లారు. ఎస్సీ గురుకుల సొసైటీ కార్యదర్శి అలుగు వర్షిణి అనాలోచిత నిర్ణయాలతో విద్యార్థులు నాణ్యమైన విద్యకు దూరమవుతున్నారని, సిబ్బందిని సైతం బానిసల కంటే హీనంగా చూస్తున్నారని మంత్రికి ఫిర్యాదు చేశారు. స్పందించిన మంత్రి సొసైటీ సెక్రటరీ వర్షిణికి ఫోన్‌చేసి వసతులు ఎందుకు కల్పించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే పూర్తి నివేదిక అందివ్వాలని ఆదేశాలు జారీ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | ఖైరతాబాద్ జీహెచ్ఎంసీ జోనల్ కార్యాలయంలో అగ్నిప్రమాదం
MG University | మహాత్మాగాంధీ యూనివర్సిటీ హాస్టల్లో విద్యార్థుల ఘర్షణ.. రెండు వర్గాలుగా విడిపోయి దాడులు
Allu Aravind | రుహానీ శర్మకు అల్లు అరవింద్ పెళ్లి సలహా.. హైదరాబాద్ అబ్బాయిని చూసుకోమంటూ కామెంట్స్.. !
IND vs NZ | టీ బ్రేక్‌కు పుంచుకున్న భారత్.. 3 ఓవర్లలో 3 వికెట్లు!
India vs Nz | రెండో టెస్టులో విజృంభిస్తున్న భారత బౌలర్స్.. టీ సమయానికి న్యూజిలాండ్ స్కోరు ఎంతంటే..!
ట్రెండింగ్ వార్తలు
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ

